Khiladi: ఈ వారమే ఖిలాడీ రిలీజ్.. ప్రమోషన్ల హడావుడి లేదేంటి?

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సక్సెస్ తో మళ్ళీ ఫుల్ జోష్ లో దూసుకెళ్తున్నాడు. మామూలుగానే రవితేజలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువని చెప్తారు. అలాంటి ఎనర్జీకి క్రాక్ సక్సెస్ తోడు కావడంతో ఆయన..

Khiladi: ఈ వారమే ఖిలాడీ రిలీజ్.. ప్రమోషన్ల హడావుడి లేదేంటి?

Khiladi: మాస్ మహారాజా రవితేజ క్రాక్ సక్సెస్ తో మళ్ళీ ఫుల్ జోష్ లో దూసుకెళ్తున్నాడు. మామూలుగానే రవితేజలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువని చెప్తారు. అలాంటి ఎనర్జీకి క్రాక్ సక్సెస్ తోడు కావడంతో ఆయన దూకుడు మామూలుగా లేదు. కరోనా తర్వాత ఈ ఏడాది మొట్టమొదటి తెలుగు బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన మాస్ మహారాజ అదే ఊపులో వరస సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఒకటికి ఐదారు సినిమాలను లైన్లో పెట్టేసిన రవితేజ ఫిబ్రవరి రెండో వారంలో తన ఖిలాడీ సినిమాని విడుదలకి తీసుకొచ్చేశాడు.

Rajinikanth: విజయ్ దర్శకుడితో సూపర్ స్టార్ కథా చర్చలు.. ఫైనల్ అయ్యేనా?

ఇప్పటికే ఖిలాడీ సినిమా సాంగ్స్, టీజర్లు సినిమా మీద భారీ అంచనాలను పెట్టేయగా తాజాగా వచ్చిన ట్రైలర్ అయితే దుమ్మురేపి రవితేజ అభిమానులకు తెగ నచ్చేస్తూ దూసుకెళ్తుంది. ఈ శుక్రవారం ఖిలాడీ సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలలో కూడా విడుదల కానున్న ఈ సినిమాని రవితేజ తొలిసారి హిందీలో కూడా విడుదల చేయనున్నారు. ఇంత చేస్తున్నా రిలీజ్ మరో నాలుగు రోజులే ఉన్నా సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి హడావుడి లేదు.

Lata Mangeshkar : లతా మంగేష్కర్ పై స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల.. త్వరలో..

సాధారణ టీవీ యాడ్స్ మినహా సినిమా యూనిట్ ప్రమోషన్ ఈవెంట్లు చేయలేదు. రవితేజ ప్రస్తుతం సినిమాల షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. మిగతా యూనిట్ దర్శక, నిర్మాతలైనా ప్రమోషన్లు చేయాల్సి ఉన్నా వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు. దీంతో రవితేజ అభిమానులు అయోమయంలో ఉన్నారు. ట్రైలర్ చూస్తే సినిమా తప్పక హిట్ కావడం ఖాయం అనిపిస్తుంది. కానీ.. ఇటు చూస్తే యూనిట్ ఎలాంటి ప్రమోషన్లు చేయడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.