RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ నుండి మరో ట్రైలర్?

మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’..

RRR: క్రేజీ అప్డేట్.. ఆర్ఆర్ఆర్ నుండి మరో ట్రైలర్?

RRR

RRR: మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. ఈ ఏడాది సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుందని దేశవ్యాప్తంగా లక్షల కళ్ళు ఎదురుచూశాయి. అయితే, కరోనా కేసుల ఉద్దృతి దృష్ట్యా చివరి క్షణాల్లో సినిమాను వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. వాయిదాల మీద వాయిదాల తర్వాత.. ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

RRR: మరో రికార్డ్.. లండన్ బీఎఫ్‌ఐ ఐమాక్స్ స్క్రీన్‌పై ఆర్ఆర్ఆర్?

మార్చి 25న వచ్చేస్తున్నాం అంటూ ఇప్పటికే మేకర్స్ కౌంట్ డౌన్ కూడా మొదలు పెట్టగా.. రెండో వారం నుండి టీమ్ ప్రమోషన్లు కూడా మొదలు పెట్టనుంది. ఇండియా నుండి దుబాయ్ వరకు ఈ ప్రమోషన్ల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుండగా మరో ట్రైలర్ కూడా కట్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సంక్రాంతిలో వాయిదా పడిన రాధేశ్యామ్ సినిమాకి కూడా తాజాగా మరో ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

RRR: దుబాయ్‌లో ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా హాలీవుడ్ యాక్షన్ హీరో?

రిలీజ్ ట్రైలర్ పేరుతో విడుదల చేసిన ఒక్క నిమిషం గల రాధేశ్యామ్ ట్రైలర్ సినిమా మీద మరింత ఆసక్తిని కలిగించగా.. ఇప్పుడు గూస్ బంప్స్ తెప్పించేలా ఆర్ఆర్ఆర్ నుండి మరో ట్రైలర్ రానుందని.. బజ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రాజమౌళి సరికొత్త ఈ ట్రైలర్‌ని రెడీ చేస్తున్నాడని తెలిసింది. అయితే, అంతకు ముందే హైదరాబాద్ లో ప్రమోషన్ ఈవెంట్ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.