RRR: దుబాయ్‌లో ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా హాలీవుడ్ యాక్షన్ హీరో?

మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా వచ్చే

RRR: దుబాయ్‌లో ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా హాలీవుడ్ యాక్షన్ హీరో?

Rrr

RRR: మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. రౌద్రం రణం రుధిరం. వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ సినిమా ఈసారి ఎలాగైనా వచ్చేస్తాం అంటూ ఓ ముహుర్తాన్ని కూడా ప్రకటించారు. మార్చి 25న ట్రిపుల్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుందని తెలిపారు. మార్చి 25 అంటే ముప్పై రోజులే మిగిలి ఉంది. అందుకే ఈ మధ్యనే ప్రమోషన్స్ మొదలు పెట్టిన టీమ్.. ముందుగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి కౌండ్ డౌన్ మొదలు పెట్టింది.

RRR: రిలీజ్ డేట్ ఇచ్చినా ప్రమోషన్ లేదేంటి జక్కన్నా?

జనవరిలో విడుదల సందర్భంగా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చుట్టేసిన టీమ్ మార్చి 31 నుండి మరోసారి ఫుల్ రచ్చకి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ముంబై, చెన్నై, బెంగళూరులో ప్రమోషన్ ఈవెంట్లు చేపట్టిన జక్కన్న అండ్ కో హైదరాబాద్ లో మాత్రం నిర్వహించలేదు. ముందుగా మార్చి తొలి వారంలో హైదరాబాద్ లో ఓ భారీ ఈవెంట్ తో ప్రమోషన్లు మొదలు పెట్టనున్న టీమ్.. అక్కడ నుండి టీవీ ఇంటర్వ్యూలు, అప్డేట్స్ రిలీజ్, గ్లిమ్స్ ఇలా వరస పెట్టి ఫ్యాన్స్ కు ఫెస్టివల్ ఇచ్చేయనున్నారట.

RRR: చరణ్-తారక్ లలో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఇదే!

ఇక ఫైనల్ గా దుబాయ్ లో కనీవినీ ఎరుగని రేంజ్ లో మార్చి 15న ఓ భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ను తీసుకొచ్చి వరల్డ్ వైజ్ గా క్రేజ్ ని తీసుకురావాలన్న ప్లాన్ తో ఉన్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతుండగా అదే నిజమైతే ఇలా ఇతర దేశాలలో హాలీవుడ్ చీఫ్ గెస్ట్ తో ఈవెంట్ చేసిన తెలుగు సినిమా ఘనత ఆర్ఆర్ఆర్ కి దక్కనుంది.