IPL 2021: చెన్నై గెలిచింది.. దక్షిణాఫ్రికాను తిట్టిపోస్తున్న డేల్ స్టెయిన్

దక్షిణాఫ్రికా మాజీ ఫేసర్ డేల్ స్టెయిన్ సౌతాఫ్రికా క్రికెట్ ను తిట్టిపోస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టైటిల్ ను చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన తర్వాత..

IPL 2021: చెన్నై గెలిచింది.. దక్షిణాఫ్రికాను తిట్టిపోస్తున్న డేల్ స్టెయిన్

Ipl 2021

IPL 2021: దక్షిణాఫ్రికా మాజీ ఫేసర్ డేల్ స్టెయిన్ సౌతాఫ్రికా క్రికెట్ ను తిట్టిపోస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టైటిల్ ను చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన తర్వాత మాజీ కెప్టెన్ డుప్లెసిస్‌కు కంగ్రాట్స్ చెప్పలేదు. ఈ సీజన్ మొత్తంలో చెన్నై జట్టు గెలవడానికి ధోనీ కెప్టెన్సీలో డుప్లెసిస్ జట్టుకు కీలకంగా వ్యవహరించాడు.

అయితే క్రికెట్ సౌతాఫ్రికా ఫేసర్ లుంగీ ఎంగిడీని మాత్రమే అభినందించి డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ ను పట్టించుకోలేదు. దీనిపై డేల్ స్టెయిన్ రెస్పాండ్ అయ్యాడు.

‘డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిరల్, ఎంగిడీ అందరినీ కలిపి ఉండాల్సింది. ఇప్పుడేమో కామెంట్ సెక్షన్ ను బ్లాక్ చేసేసింది. ఇటువంటి పనులు చేసి విలువ కోల్పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి’ అంటూ ట్వీట్ చేశాడు.

సౌతాఫ్రికా క్రికెట్ లో ఏమవుతుంది. డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ లకు ఎందుకు ఆ గౌరవం దక్కడం లేదు. కచ్చితంగా వారి పట్ల గౌరవంగా ప్రవర్తించాల్సిందే’ అంటూ ఇన్ స్టాగ్రమా్ లోనూ పోస్టు పెట్టాడు.

…………………………………: మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు

ఐపీఎల్ 2021 సీజన్ 14 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను చెన్నై 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ధోని సేన ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. ముందు బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆ తర్వాత బౌలర్లు రాణించారు. దీంటో ఈ మ్యాచ్ లో సీఎస్కే ఘన విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది.

టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ డుప్లెసిస్ దంచికొట్టాడు. సిక్సుల వర్షం కురిపించాడు. 59 బంతుల్లో 86 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగులు, రాబిన్ ఊతప్ప 31 పరుగులు, మోయిన్ ఆలీ 37 పరుగులతో రాణించారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు, శివమ్ మావి ఒక వికెట్ తీశారు.

193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా జట్టుకి ఓపెనర్లు గిల్, అయ్యర్ బ్రిలియంట్ స్టార్ట్ ఇచ్చారు. అయితే చెన్నై బౌలర్లు కమ్ బ్యాక్ చేశారు.కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కీలక సమయంలో వికెట్లు తీశారు. ఆ తర్వాత రెగులర్ ఇంటర్ వెల్స్ లో వికెట్లు పడ్డాయి. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేసింది.

కోల్ కతా జట్టులో ఓపెనర్లు గిల్(43 బంతుల్లో 51), వెంకటేశ్ అయ్యర్(32 బంతుల్లో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం అయ్యారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, హేజిల్ వుడ్ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు తీశారు. దీపక్ చహర్, బ్రావో చెరో వికెట్ తీశారు. ఐపీఎల్ లో ఏకంగా తొమ్మిదిసార్లు ఫైనల్‌ చేరిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. టైటిల్‌ను గెలవడం ఇది నాలుగోసారి.