Deepika Padukone : ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై దీపికా పదుకునే వ్యాఖ్యలు

ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు మీరు నటించిన వారు కాకుండా నటించని స్టార్స్ లో ఎవరితో మీరు నటించాలని అనుకుంటున్నారు అంటూ దీపికను ప్రశ్నించగా, దీపికా మాట్లాడుతూ.. తారక్ తో కలిసి.........

Deepika Padukone :  ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై దీపికా పదుకునే వ్యాఖ్యలు

Chirandeepika

Deepika Padukone :   దీపికా పదుకునే, అనన్య పాండే కలిసి ‘గెహ్రాయాన్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ లో రిలీజ్ అవ్వనుంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా దీపికా పదుకునే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ గురించి ప్రస్తావించింది.

ఈ ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు మీరు నటించిన వారు కాకుండా నటించని స్టార్స్ లో ఎవరితో మీరు నటించాలని అనుకుంటున్నారు అంటూ దీపికను ప్రశ్నించగా, దీపికా మాట్లాడుతూ.. తారక్ తో కలిసి నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎన్టీఆర్ తో నటించడానికి సమయం ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అలాగే అల్లు అర్జున్ తో కూడా నటించాలి అనుకుంటున్నాను.” అని తెలిపింది.

Tollywood : వర్మ vs మెగా.. ఏపీ ప్రభుత్వంతో ఎవరు ఎలా మాట్లాడారు?

అలాగే ప్రస్తుతం దీపికా పదుకునే ప్రభాస్ తో కలిసి ‘ప్రాజెక్ట్ K’లో నటిస్తుంది. ఈ సినిమా గురించి చెప్తూ ప్రభాస్ తో నటించడం చాలా బాగుందని, ప్రభాస్ మంచి కోస్టార్ అని తెలిపింది. ఇక బాలీవుడ్ స్టార్స్ పేర్లు చెప్పకుండా ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ మన హీరోలతో కలిసి నటించడానికి ఇష్టపడుతున్నారు అంటే మన స్టార్స్ పాన్ ఇండియా వైడ్ ఎంత రేంజ్ కి ఎదిగారో తెలిసిపోతుంది.