Tollywood : వర్మ vs మెగా.. ఏపీ ప్రభుత్వంతో ఎవరు ఎలా మాట్లాడారు?

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో సినిమా పరిశ్రమ కష్టాలపై ట్వీట్స్ వేసి ఏపీ సినిమాటోగ్రాఫర్ మంత్రి పేర్ని నాని ని ప్రశ్నించాడు. పేర్ని నాని కూడా..........

Tollywood :  వర్మ vs మెగా.. ఏపీ ప్రభుత్వంతో ఎవరు ఎలా మాట్లాడారు?

Chiranjeevi (5)

RGV vs Chiru :  సినీ పరిశ్రమ కష్టాలు, సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు గత కొన్ని నెలలుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ముందుండి వీటన్నిటికీ పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీటిపై ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు. గతంలో ఏపీ సీఎం జగన్ ని, మంత్రి పేర్ని నానితో కలిసి సమస్యలని వివరించారు. తాజాగా నిన్న మరోసారి చిరంజీవి తనతో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డిలను తీసుకువెళ్లి జగన్ తో మాట్లాడారు.

ఇక సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో సినిమా పరిశ్రమ కష్టాలపై ట్వీట్స్ వేసి ఏపీ సినిమాటోగ్రాఫర్ మంత్రి పేర్ని నాని ని ప్రశ్నించాడు. పేర్ని నాని కూడా వీటిలో కొన్నిటికి సమాధానం ఇచ్చాడు. ఇలా ఏపీ ప్రభుత్వంతో, పేర్ని నానితో ట్విట్టర్ లో వార్ జరిపి మంత్రిని కలవడానికి ట్విట్టర్ లోనే అపాయింట్మెంట్ ఇప్పించుకున్నాడు ఆర్జీవీ. ఈ విషయంలో ఆర్జీవీ గ్రేట్ అని అందరూ అన్నారు.

ఎందుకంటే టాలీవుడ్ నుంచి ఎవరు వెళ్లి ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. ఈ అపాయింట్మెంట్ కోసం కూడా కష్టపడాల్సిందే. చిరంజీవి కానీ ఇతర సినీ ప్రముఖులు కానీ ఏపీ ప్రభుత్వం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లి కలిశారు. కానీ ఆర్జీవీ మాత్రం తన ట్వీట్స్ తోనే ట్విట్టర్ లో పేర్ని నాని నుంచి అపాయింట్ మెంట్ తెచ్చుకున్నారు.

RGV : పేర్ని నానితో భేటీ తర్వాత కూడా మళ్ళీ వరుస ట్వీట్లు పెడుతున్న వర్మ

ఇక నిన్న టాలీవుడ్ స్టార్స్ జగన్ ని కలిసిన మీటింగ్ లో మన స్టార్స్ అంతా జగన్ ని సినీ పరిశ్రమని రక్షించమని, థియేటర్స్ ని రక్షించమని ప్రాధేయపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి అయితే చేతులెత్తి దండం పెట్టి సినిమా పరిశ్రమని కాపాడండి అని వేడుకున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడారు. అయితే ఈ వీడియోలు చూసిన వారంతా మెగా స్టార్ రేంజ్ ఆయన అలా ఒక నాయకుడి దగ్గర అడుక్కోవడం చూడటానికి చాలా కష్టంగా ఉందని అంటున్నారు. దీనిపై ఆర్జీవీ కూడా ట్వీట్ చేస్తూ.. ”సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఈ మీటింగ్ జరిగినప్పటికీ, ఒమేగా స్టార్‌ని వైఎస్ జగన్ ఆశీర్వదించినందుకు నేను సంతోషిస్తున్నాను. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్‌ని నేను అభినందిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

Chiranjeevi : ఎవరేమన్నా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే..

అంతకుముందే రామ్ గోపాల్ వర్మ.. ”ఓ మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా హర్ట్ అయ్యా” అంటూ ట్వీట్ చేసి డిలీట్ చేశారు. కేవలం ఆర్జీవీ మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకులంతా తమ హీరోలు వెళ్లి అలా మాట్లాడటంతో చాలా బాధపడ్డారు. ఆర్జీవీ గతంలో ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు లాజిక్స్, లా పాయింట్స్ పట్టుకొని మాట్లాడాడు. సినిమా గురించి, ప్రజలకు వినోదం అనే కాన్సెప్ట్ గురించి అన్ని లా పాయింట్స్, చట్టాలు పట్టుకొని తెలివిగా మాట్లాడారు. ఇది ఏపీ ప్రభుత్వానికి మింగుడుపడలేదు. సమాధానం కూడా ఇవ్వలేకపోయారు. ఆర్జీవీ సమస్యని చట్ట బద్దంగా సాల్వ్ చేద్దామని చూశారు. కానీ ఏపీ ప్రభుత్వం తరపున పేర్ని నాని ఆర్జీవితో మాట్లాడి పంపించేశారు.

Chiranjeevi : ఒకే ఫ్రేమ్‌లో మెగా, సూపర్, రెబల్ స్టార్స్.. అదిరిపోయిన ఫోటో..

ఇలా ఆర్జీవీ చట్టబద్దంగా లాజికల్ గా మాట్లాడటం, మెగా స్టార్ ఏమో అలా చేతులెత్తి వేడుకోవడం చూసి అందరూ దీనిపై మాట్లాడుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఇది మన హక్కు, మన హక్కుని మనం అడుక్కోవటం ఏంటని గట్టిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడారు. చాలా మంది ప్రజలు ఇలా మాట్లాడితేనే కరెక్ట్ అని కూడా సమర్ధించారు పవన్ ని. అయితే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం వల్లే సమస్య ఇంతవరకు వచ్చింది అని భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇగోకి వెళ్లి స్టార్స్ తో ఇలా మాట్లాడించేలా చేసింది, కావాలనే సినీ పరిశ్రమని ఇబ్బందుల్లో పెట్టి, ఇప్పుడు మళ్ళీ వల్లే సాల్వ్ చేస్తున్నట్టు నటిస్తున్నారు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చిరంజీవి చాలా రిక్వెస్ట్ గా మాట్లాడుతూ సమస్యని పరిష్కరించడానికి ట్రై చేస్తున్నారని అనుకుంటున్నారు.

జనాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి విధానం నచ్చింది. ఎవరికి ఏది నచ్చినా, ఎవరు ఎలా మాట్లాడినా, ప్రభుత్వానికి నచ్చిందే చేస్తుంది. చివరకి ఈ సమస్య పరిష్కారం అయితే చాలు అని అటు సినీ పరిశ్రమ వర్గాలు, ఇటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.