Chiranjeevi : ఎవరేమన్నా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే..

జగన్ తో మీటింగ్ అనంతరం రాజమౌళి ఈ విషయం పై మాట్లాడుతూ.. ''చిరంజీవి గారికి పెద్ద అంటే ఇష్టం ఉండదు. కానీ ఆయన చర్యలతో ఇండస్ట్రీ పెద్ద ఆయనే అని చెప్పొచ్చు. సీఎంతో చిరుకు ఉన్న..........

Chiranjeevi :  ఎవరేమన్నా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే..

Chiranjeevi (4)

Chiranjeevi :  సినీ టికెట్ల ధరలపై, సినీ పరిశ్రమ కష్టాల గురించి నిన్న గురువారం చిరంజీవితో పాటు మరి కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు వెళ్లి జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. వీటికి జగన్ సానుకూలంగా స్పందించారు అని మీడియాతో తెలిపారు. ఈ విషయంలో మరో సారి చిరంజీవి సినీ పరిశ్రమకి కష్టాలొస్తే ముందు ఉంటాను అని నిరూపించుకున్నారు. అయన ఎప్పుడూ సినీ పరిశ్రమ కోసం ముందు ఉంటారు.

 

గతంలో ఇండస్ట్రీ పెద్ద అంటూ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద కాదు అని వ్యాఖ్యలు కూడా చేశారు. చిరంజీవి ఎప్పుడూ తాను ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకోలేదు. కానీ కష్టం వచ్చినప్పుడు ముందున్నారు. అలాగే నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను, నాకు ఆ పేరు వద్దు. సినీ పరిశ్రమ కష్టాల్లో ఉంటే ముందుండి నడిపిస్తాను అని చిరంజీవి ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Tollywood : జగన్‌తో భేటీపై స్టార్లు వేసిన ట్వీట్లు ఇవే..

జగన్ తో మీటింగ్ అనంతరం రాజమౌళి ఈ విషయం పై మాట్లాడుతూ.. ”చిరంజీవి గారికి పెద్ద అంటే ఇష్టం ఉండదు. కానీ ఆయన చర్యలతో ఇండస్ట్రీ పెద్ద ఆయనే అని చెప్పొచ్చు. సీఎంతో చిరుకు ఉన్న సాన్నిహిత్యాన్ని వినియోగించి ఇంత పెద్ద సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేశారు. కొన్ని నెలలుగా అసలు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటన్న సందిగ్ధత ఉన్నప్పుడు చిరంజీవి గారు ఒక్కరే ఇంత పెద్ద సమస్యను ఆయన భుజాల మీద వేసుకొని దానికి పరిష్కారం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమ కష్టాలు తొలిగిపోవడానికి ఇంతగా శ్రమిస్తున్నందుకు ధన్యవాదాలు.” అని అన్నారు.

Ramesh varma : స్టేజిపైనే హీరోయిన్‌కి సారీ చెప్పిన ఖిలాడీ డైరెక్టర్

దీంతో టాలీవుడ్ లో అందరికి అర్ధమవుతుంది. కొంతమంది తామే ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకొని ఎలాంటి పనులు చెయ్యట్లేదు, ఇండస్ట్రీ తరపున మాట్లాడట్లేదు. కానీ చిరంజీవి కష్టం వచ్చిన ప్రతి సారి ముందుండి, ఆయన భుజాలపై వేసుకొని పరిశ్రమ కోసం పని చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి మాట్లాడారు. మళ్ళీ ఎన్ని సార్లు కావాలన్నా మాట్లాడతారు ఆయన. మొత్తానికి ఎవరు ఔనన్నా కాదన్నా, ఎవరు ఏమనుకున్నా ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారే అని టాలీవుడ్ లో అందరూ అనుకుంటున్నారు.