Delhi Air Quality : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం!

దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో వాయు కాలుష్యం భారీగా పెరిగినట్టు SAFAR వెల్లడించింది.

Delhi Air Quality : దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగినట్టు కనిపిస్తోంది. గాలి నాణ్యత కూడా తీవ్రంగా తగ్గినట్టు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ (SAFAR) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQ1) 302గా నమోదైందని పేర్కొంది. దీపావళి సందర్భంగా టపాసులు పేలిస్తే గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గాలి కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

నవంబర్ 1, 2 తేదీల్లో ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంటుందని సఫర్ అంచనా వేసింది. నవంబర్ 4 వరకు గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయికి పడిపోవచ్చునని భారత వాతావరణ విభాగం (IMD) ఆదివారమే అంచనా వేసింది. నవంబర్ 5 నుంచి 6 తేదీల్లో గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలోని పలు వాయుకాలుష్య ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని సఫర్ తెలిపింది.

PM2.5 అనేది తీవ్ర కాలుష్యకారిణిగా IMD పేర్కొంది. ప్రభుత్వ ఏజెన్సీల ప్రకారం.. AQI అనేది.. 0 నుంచి 5 మధ్య నమోదైతే.. అది గాలి నాణ్యత మంచి స్థాయిలో ఉన్నట్టు.. అదే 51-100 మధ్య ఉంటే పర్వాలేదు.. 101-200 మధ్య ఉంటే మోస్తరుగా ఉన్నట్టు.. 201-300 మధ్య గాలి నాణ్యత నమోదైతే చాలా పేలవంగా ఉందని, 301-400 మధ్య ఉంటే మరి అధ్వాన్నంగా ఉందని, ఇక చివరిగా 401-500 మధ్య ప్రమాదకర స్థాయిలో ఉందని గుర్తిస్తారు.
Read Also : Huzurabad By Election : హుజూరాబాద్ బాద్ షా ఎవరు ? ఓటరు ఎటు వైపు ? 

ట్రెండింగ్ వార్తలు