Dhamaka Scenes : ధమాకా సినిమాలో ఈ పాటకి, ఆ సీన్ కి థియేటర్స్ దద్ధరిల్లిపోతున్నాయిగా.. ఎంటర్టైన్మెంట్ పీక్స్..

ఇటీవల యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయిన పల్సర్ బైక్ సాంగ్ ని ధమాకా సినిమాలో సెకండ్ హాఫ్ లో పెట్టారు. ఇక ఈ మాస్ బీట్ సాంగ్ కి రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్పులతో కుమ్మేసారు. ఈ పాట వచ్చినప్పుడు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఇక సింగిల్ స్క్రీన్స్ లో అయితే..................

Dhamaka Scenes : ధమాకా సినిమాలో ఈ పాటకి, ఆ సీన్ కి థియేటర్స్ దద్ధరిల్లిపోతున్నాయిగా.. ఎంటర్టైన్మెంట్ పీక్స్..

Dhamaka movie some Scenes gives full entertainment in Theaters

Dhamaka Scenes : రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అయింది. రవితేజ గత రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకొని రవితేజ మొదటిసారి ముందుండి ప్రమోషన్స్ చేశాడు. చిత్ర యూనిట్ భావించినట్టే ఈ సినిమాకి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా హిలేరియస్ గా ఉందంటున్నారు.

కామెడీ, మాస్ ఎంటర్టైనర్ గా ధమాకా సినిమా అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ కామెడీ ఉంటుంది. దీంతో ప్రేక్షకులు థియేటర్లలో పడి పడి నవ్వేస్తున్నారు. అయితే సినిమా మొత్తానికి ఎంటర్టైన్మెంట్ ఓ రెండు సన్నివేశాల్లో బాగా పండింది. గతంలో రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో గున్న గున్న మామిడి అనే ఫోక్ సాంగ్ తో అదరగొట్టాడు. సినిమాలో ఆ పాట వచ్చే సన్నివేశానికి బాగా రెస్పాండ్ వచ్చింది.

దీంతో ధమాకా సినిమాలో కూడా అలాంటి పాట ఒకటి పెట్టారు. ఇటీవల యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయిన పల్సర్ బైక్ సాంగ్ ని ధమాకా సినిమాలో సెకండ్ హాఫ్ లో పెట్టారు. ఇక ఈ మాస్ బీట్ సాంగ్ కి రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్పులతో కుమ్మేసారు. ఈ పాట వచ్చినప్పుడు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఇక సింగిల్ స్క్రీన్స్ లో అయితే ఈ పాట వచ్చినప్పుడు రచ్చ రచ్చే. ఈ పాటు సినిమా ఎంటర్టైన్మెంట్ కి బాగా ప్లస్ అయింది.

Okkadu : 20 ఏళ్ళ తర్వాత.. మహేష్ ని మాస్ హీరో చేసిన సినిమా రీ రిలీజ్..

ఇక ఫస్ట్ హాఫ్ లో ఇంద్ర సినిమాలో ప్రకాష్ రాజ్ చిరంజీవి గుర్తుపట్టే సీన్ లాగే ఒక సీన్ ని పెట్టారు. రవితేజ, రావు రమేష్, శ్రీలీల మధ్య ఉండే ఆ సన్నివేశం అందర్నీ తెగ నవ్విస్తుంది. ఈ సీన్ లో ఇంద్ర సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాడటంతో థియేటర్లో ఆ సీన్ మరింత పేలింది. ఈ సీన్ లో కూడా ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు. మొత్తానికి మరోసారి రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ ధమాకా సినిమాతో ఇచ్చి హిట్ కొట్టారు.