Okkadu : 20 ఏళ్ళ తర్వాత.. మహేష్ ని మాస్ హీరో చేసిన సినిమా రీ రిలీజ్..

మహేష్ బాబు ఇటీవల పోకిరి సినిమాని రీ రిలీజ్ చేసి కలెక్షన్స్ బాగానే రప్పించారు. ఇప్పుడు తన కెరీర్ లో మొదటి మాస్ యాక్షన్ సినిమా అయిన 'ఒక్కడు' సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ కబడ్డీ ప్లేయర్ గా, హీరోయిన్ ని విలన్ నుంచి రక్షించే నేపథ్యంలో గుణశేఖర్ దర్శకత్వంలో................

Okkadu : 20 ఏళ్ళ తర్వాత.. మహేష్ ని మాస్ హీరో చేసిన సినిమా రీ రిలీజ్..

Okkadu Movie Re Release on 7th Jan 2023

Updated On : December 26, 2022 / 7:15 AM IST

Okkadu :  ఇటీవల గతంలో సూపర్ హిట్ అయినా స్టార్ హీరోల సినిమాలని రీ రిలీజ్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీ రిలీజ్ లపై అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తూ, కలెక్షన్స్ కూడా వస్తుండటంతో పాత సూపర్ హిట్ సినిమాలన్నీ బయటకి తీస్తున్నారు సినీ వర్గాలు. ఇప్పటికే మహేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ, ప్రభాస్, ధనుష్.. ఇలా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. త్వరలో మరింతమంది స్టార్ హీరోలు కూడా రీ రిలీజ్ లకి క్యూ కట్టనున్నారు.

మహేష్ బాబు ఇటీవల పోకిరి సినిమాని రీ రిలీజ్ చేసి కలెక్షన్స్ బాగానే రప్పించారు. ఇప్పుడు తన కెరీర్ లో మొదటి మాస్ యాక్షన్ సినిమా అయిన ‘ఒక్కడు’ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. మహేష్ కబడ్డీ ప్లేయర్ గా, హీరోయిన్ ని విలన్ నుంచి రక్షించే నేపథ్యంలో గుణశేఖర్ దర్శకత్వంలో కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ఒక్కడు అప్పట్లో భారీ విజయం సాధించింది. అప్పటివరకు క్లాస్ హీరోగా ఉన్న మహేష్ ని ఈ సినిమా మాస్ హీరోగా నిలబెట్టింది.

Samantha : మరింత స్ట్రాంగ్‌గా తయారవుతా.. ఆ డైరెక్టర్ ఇచ్చిన గిఫ్ట్‌తో సమంత..

ఒక్కడు సినిమా 2003లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. తాజాగా 20 ఏళ్ళ తర్వాత ఈ సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఒక్కడు రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఒక్కడు సినిమాని 2023 జనవరి 7న సంక్రాంతికి ఒక వారం రోజుల ముందు రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి థియేటర్స్ లో రచ్చ చేయడానికి మహేష్ ఫ్యాన్స్ రెడీ అయిపోయారు.