Dhanush : అటు అన్నదమ్ములు.. ఇటు అక్క చెల్లెళ్లు.. విడాకుల పర్వం

ధనుష్ విడాకులతో మరోసారి ధనుష్ ఫ్యామిలీ, రజినీకాంత్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తుంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ రజినికాంత్ కూతురు ఐశ్వర్యని 2004లో వివాహం చేసుకున్నాడు. ఐశ్వర్య ధనుష్...

Dhanush : అటు అన్నదమ్ములు.. ఇటు అక్క  చెల్లెళ్లు.. విడాకుల పర్వం

Dhanush Ayishwarya

Dhanush :   ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకే వైవాహిక జీవితానికి స్వస్తి చెప్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్నీ సినీ పరిశ్రమలలో సెలబ్రిటీల విడాకులు వార్తల్లో నిలుస్తున్నాయి. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ లో స్టార్ హీరో అమిర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నారు. ఇటీవల టాలీవుడ్ లో నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయినట్లు ప్రకటించారు.

అయితే ధనుష్ విడాకులతో మరోసారి ధనుష్ ఫ్యామిలీ, రజినీకాంత్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తుంది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ రజినికాంత్ కూతురు ఐశ్వర్యని 2004లో వివాహం చేసుకున్నాడు. ఐశ్వర్య ధనుష్ కంటే వయసులో రెండు సంవత్సరాలు పెద్దది అవ్వడం గమనార్హం. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నిన్న సాయంత్రం ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్లు వారి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలిపారు.

Warrior : మళ్ళీ టైటిల్ వివాదం.. రామ్, హవీష్ ఎవరు ‘వారియర్’??

ఇక ఐశ్వర్య సోదరి రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య కూడా 2010లో అశ్విన్ రామ్ కుమార్ ని వివాహం చేసుకొని 2017లో విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2019లో ఆర్టిస్ట్ విశగన్ వంగమూడిని వివాహం చేసుకుంది. తాజాగా అక్క విడాకులు ఇవ్వడంతో మళ్ళీ గతంలో జరిగిన చెల్లి సౌందర్య విడాకుల గురించి కూడా మాట్లాడుతున్నారు.

ఇక ధనుష్ అన్నయ్య ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా గతంలో విడాకులు తీసుకున్నాడు. సెల్వ రాఘవన్ 2006లో 7/g బృందావన కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ ని వివాహం చేసుకున్నారు. 2010లో సోనియాకి విడాకులు ఇచ్చి మళ్ళీ 2011లో ఆర్టిస్ట్ గీతాంజలిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ధనుష్ విడాకులు ఇవ్వడంతో మరోసారి అన్నయ్య సెల్వ రాఘవన్ విడాకులు కూడా వార్తల్లో నిలుస్తున్నాయి.

Anushka : ‘అరుంధతి’ సినిమాపై అనుష్క ఎమోషనల్ పోస్ట్

ఐశ్వర్య చెల్లి సౌందర్య విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంది. అలాగే ధనుష్ అన్న సెల్వ రాఘవన్ కూడా విడాకుల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు ధనుష్, ఐశ్వర్యలు భవిష్యత్తులో వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? లేక సింగిల్ గానే ఉండిపోతారా అనే ప్రశ్న తలెత్తుతుంది.