Dhruv-Banita : ప్రేమలో మునిగితేలుతున్న ‘అర్జున్‌రెడ్డి’ హీరో హీరోయిన్??

ధృవ్ తాను నటించిన 'ఆదిత్య వర్మ' సినిమాలోని హీరోయిన్ బనిత సంధుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ భామ బనిత సంధుతో ధృవ్ ప్రేమలో ఉన్నట్టు, చెట్టాపట్టాలేసుకొని...........

Dhruv-Banita : ప్రేమలో మునిగితేలుతున్న ‘అర్జున్‌రెడ్డి’ హీరో హీరోయిన్??

Dhruvbanitha

Dhruv-Banita :  తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. తర్వాత ఈ సినిమా వేరే భాషల్లో రీమేక్ కి కూడా వెళ్ళింది. అర్జున్ రెడ్డి సినిమాని తమిళ్ లో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ రీమేక్ చేశాడు. అయితే ఇది ధృవ్ కి డెబ్యూ మూవీ కావడం విశేషం. ఈ సినిమా తమిళ్ లో ‘ఆదిత్య వర్మ’గా తెరకెక్కింది. తమిళ్ లో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.

అయితే ఇటీవల ధృవ్ తాను నటించిన ‘ఆదిత్య వర్మ’ సినిమాలోని హీరోయిన్ బనిత సంధుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ భామ బనిత సంధుతో ధృవ్ ప్రేమలో ఉన్నట్టు, చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై వీరిద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ‘ఆదిత్య వర్మ’ సినిమా విడుదలై రెండేళ్లు అయిపోయినా ఇప్పటికీ ధృవ్, బనిత చాలా కోజ్ గా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. మీడియాకి ఫోటోలకు ఫోజులు కూడా ఇస్తున్నారు.

Dulquer Salmaan : సంక్రాంతి బరిలో మలయాళ స్టార్ హీరో కూడా

తాజాగా ఈ జంట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లింది. దీంతో ఈ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. దుబాయిలోని బుర్జ్ ఖలీఫాకు దగ్గరలో ఉన్న ఓ హోటల్‌లో వీళ్లిద్దరు గడిపారు. అక్కడే గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే ధృవ్ ఆ హోటల్ గది నుంచి బనిత బుర్జ్ ఖలీఫాను చూస్తున్న వీడియోను స్వయంగా రికార్డ్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. దీంతో వీరిద్దరి మధ్య కచ్చితంగా ప్రేమ ఉండాలి. లేదా వీళ్లిద్దరు డేటింగ్ లో అయినా ఉండాలి అని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి వీళ్లిద్దరి దుబాయ్ వెళ్లి గ్రాండ్ గా ఒకే రూమ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారంటే ఏదో ఉంది అని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.