Dulquer Salmaan : సంక్రాంతి బరిలో మలయాళ స్టార్ హీరో కూడా

తాజాగా మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. దుల్కర్ నటించిన ‘సెల్యూట్‌’ చిత్రాన్ని మలయాళంలో జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌..........

Dulquer Salmaan :  సంక్రాంతి బరిలో మలయాళ స్టార్ హీరో కూడా

Dulqer

Dulquer Salmaan :

తెలుగు వాళ్లకి సంక్రాంతి పెద్ద పండుగ. సినిమాలకి కూడా సంక్రాంతి పెద్ద పండుగ. ప్రతి సంవత్సరం సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తాయి. కాని ఈ సంక్రాంతికి కరోనా వల్ల, ఏపీలో థియేటర్స్, టికెట్ రేట్ల ప్రాబ్లమ్ వల్ల పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో చిన్న సినిమాలన్నీ ఒకే సారి క్యూ కట్టాయి. పెద్ద సినిమాల్లో ‘రాధేశ్యామ్’ కూడా ఇంకా డౌట్ గానే ఉంది. ఇక ‘బంగార్రాజు’ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే చాలు అని రిలీజ్ కి సిద్ధమైపోయింది.

‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’ లాంటి పెద్ద సినిమాలు వాయిదా పడటంతో దొరికిందే మంచి ఛాన్స్ అనుకోని సంక్రాంతిని కాష్ చేసుకోవాలని చాలా చిన్న సినిమాలు ఒకేసారి సంక్రాంతికి విడుదలని అనౌన్స్ చేశాయి. ‘డీజే టిల్లు’, ‘హీరో’, ‘సూపర్ మచ్చి’, ‘రౌడీ బాయ్స్’, ‘7 డేస్ 6 నైట్స్’ లాంటి చిన్న సినిమాలన్నీ రాబోతున్నాయి. తాజాగా ఈ లిస్టులోకి మరో సినిమా చేరింది.

తాజాగా మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. దుల్కర్ నటించిన ‘సెల్యూట్‌’ చిత్రాన్ని మలయాళంలో జనవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ గతంలోనే ప్రకటించింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలు వాయిదా పడటంతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్, ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ ని కూడా సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. దీంతో ‘సెల్యూట్’ సినిమాని ఈ సంక్రాంతికి తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో దుల్కర్ పవర్ ఫుల్, సిన్సియర్ పోలీస్ గా కనిపించనున్నారు.

RGV : రాజమౌళి కంటే గొప్ప సినిమా మీరు తీసి పేదలకి ఫ్రీగా చూపించండి

ఒక్కసారిగా పెద్ద సినిమాలు తప్పుకోవడంతో చిన్న సినిమాలు పండగ టైంని క్యాష్ చేసుకోడానికి ట్రై చేస్తున్నాయి. మరి ఇన్ని చిన్న సినిమాల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందుతాయో చూడాలి. ఈ సారి పండగ విజేత ఎవరో చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.