RGV : రాజమౌళి కంటే గొప్ప సినిమా మీరు తీసి పేదలకి ఫ్రీగా చూపించండి

ఈ విషయంపై ఆర్జీవీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో సినిమాని పేదలకి అందించాలని తహతహలాడుతున్న ఏపీ సీఎం జగన్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్నినాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నానిలు..

RGV : రాజమౌళి కంటే గొప్ప సినిమా మీరు తీసి పేదలకి ఫ్రీగా చూపించండి

Rgv (1)

RGV :   ఏపీలో సినిమా టికెట్ల రేట్లు, థియేటర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని అందరూ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ చాలా మంది సినీ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు మాట్లాడారు. ఇటీవల ఈ విషయంపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా వరుస పెట్టి ప్రెస్ మీట్స్ లో, ఇంటర్వ్యూలలో ఏపీ ప్రభుత్వాన్ని సినిమా టికెట్ల విషయంలో ప్రశ్నిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎవరూ ముందుకొచ్చి ప్రశ్నించకపోయినా ఆర్జీవీ వచ్చి మాట్లాడుతున్నాడు.

ఏపీ ప్రభుత్వానికి, ఏపీ మంత్రి పేర్ని నానికి సినిమా టికెట్ల ధరల విషయంలో వరుస ప్రశ్నలు సంధిస్తున్నాడు. ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలలోనే కాక ట్విట్టర్ లో కూడా ఈ సమస్యపై పేర్ని నానికి వరుస ప్రశ్నలతో ట్వీట్స్ చేస్తున్నాడు. అంతే కాక ఈ విషయంలో సినీ పెద్దలు, చాలా మంది సినీ ప్రముఖులు సైలెంట్ గా ఉండటంతో వాళ్ళ మీద కూడా నోరు విప్పి ఇప్పటికైనా మాట్లాడండి అంటూ ట్వీట్ చేశాడు.

RGV : ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. సినీ పెద్దలపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు

తాజాగా నిన్న రాత్రి ఈ విషయంపై ఆర్జీవీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో సినిమాని పేదలకి అందించాలని తహతహలాడుతున్న ఏపీ సీఎం జగన్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్నినాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నానిలు కలిసి రాజమౌళి కంటే గొప్ప సినిమా తీయాలని, దాన్ని పేద ప్రజలకు ఫ్రీగా చూపించాలని సెటైర్స్ వేశాడు వర్మ. మీకు అలాంటి కెపాసిటీ లేనప్పుడు మీకున్న పవర్ ని ఉపయోగించుకొని కెపాసిటీ ఉన్నవాళ్ళ ప్రతిభను తగ్గించడం రెడిక్యులస్ అని అన్నారు. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.