RGV : ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. సినీ పెద్దలపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు

చాలా మంది సినీ ప్రముఖులు సైలెంట్ గా ఉండటంతో వాళ్ళ మీద కూడా ట్వీట్ చేశాడు ఆర్జీవి. ''ఇది నా రిక్వెస్ట్ కాదు. నా డిమాండ్. నాతో పాటు సినీ పరిశ్రమలో పని చేసే వ్యక్తులంతా ఇప్పటికైనా....

RGV : ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. సినీ పెద్దలపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు

Rgv Tweet

 

RGV :   గత కొన్ని నెలలుగా ఏపీలో సినిమా టికెట్ల రేట్లు, థియేటర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అందరికి నష్టాన్ని చేకూరుస్తుంది. వీటిపై వ్యతిరేకిస్తూ ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా కామెంట్ చేశాడు. అక్కడితో ఆగకుండా వరుస పెట్టి ప్రెస్ మీట్స్ లో, ఇంటర్వ్యూలలో ఏపీ ప్రభుత్వాన్ని సినిమా టికెట్ల విషయంలో ప్రశ్నిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎవరూ ముందుకొచ్చి ప్రశ్నించకపోయినా మొదటి సారి సినీ పరిశ్రమకి కష్టం వస్తే ఆర్జీవీ వచ్చి మాట్లాడుతున్నాడు.

ఏపీ ప్రభుత్వానికి, ఏపీ మంత్రి పేర్ని నానికి సినిమా టికెట్ల ధరల విషయంలో వరుస ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఆర్జీవీ వేసే ప్రశ్నలకి, చెప్పే లాజిక్కులకి వాళ్ళకి ఏం సమాధానాలు చెప్పాలో అర్ధం కావట్లేదు. దీంతో నెటిజన్లు కూడా ఆర్జీవికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ట్విట్టర్ లో పేర్ని నానికి వరుస ప్రశ్నలతో ట్వీట్స్ చేస్తున్నాడు. అంతే కాక ఈ విషయంలో సినీ పెద్దలు, చాలా మంది సినీ ప్రముఖులు సైలెంట్ గా ఉండటంతో వాళ్ళ మీద కూడా ట్వీట్ చేశాడు.

RGV : పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆర్జీవీ

”ఇది నా రిక్వెస్ట్ కాదు. నా డిమాండ్. నాతో పాటు సినీ పరిశ్రమలో పని చేసే వ్యక్తులంతా ఇప్పటికైనా మాట్లాడండి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న టికెట్ రేట్ల విధానంలో మీ నిజమైన ఫీలింగ్స్ ని బయట పెట్టండి. ఇప్పుడు నోళ్లు మూసుకొని కూర్చుంటే ఇంకెప్పటికీ తెరవలేరు. తర్వాత మీ ఖర్మ” అంటూ సినిమా వ్యక్తుల్ని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశాడు ఆర్జీవీ. మరి ఆర్జీవి చేసిన ట్వీట్ కి ఎవరైనా స్పందించి సినీ సమస్యలపై పోరాడటానికి ముందుకొస్తారా? లేక సైలెంట్ గానే ఉంటారా చూడాలి.