RGV : పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆర్జీవీ

ఆర్జీవీ వరుస పెట్టి ప్రెస్ మీట్స్ లో, ఇంటర్వ్యూలలో ఏపీ ప్రభుత్వాన్ని సినిమా టికెట్ల విషయంలో ప్రశ్నిస్తున్నాడు. తాజాగా మరోసారి ఆర్జీవీ మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం........

RGV : పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఆర్జీవీ

Rgv

RGV :   సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ప్రపంచంలో ఏ మూల ఏ విషయం జరిగినా దానిపై కామెంట్ చేస్తూ ఉంటాడు. అలాంటిది తన సినిమా ఇండస్ట్రీ గురించి తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాడు. గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమలో ఏపీ సినిమా టికెట్ల ధరలు, ఏపీ థియేటర్ల మూసివేత హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా కామెంట్ చేశాడు.

అక్కడితో ఆగకుండా వరుస పెట్టి ప్రెస్ మీట్స్ లో, ఇంటర్వ్యూలలో ఏపీ ప్రభుత్వాన్ని సినిమా టికెట్ల విషయంలో ప్రశ్నిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎవరూ ముందుకొచ్చి ప్రశ్నించకపోయినా మొదటి సారి సినీ పరిశ్రమకి కష్టం వస్తే ఆర్జీవీ వచ్చి మాట్లాడుతున్నాడు. ఏపీ ప్రభుత్వానికి, ఏపీ మంత్రి పేర్ని నానికి సినిమా టికెట్ల ధరల విషయంలో వరుస ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఆర్జీవీ వేసే ప్రశ్నలకి, చెప్పే లాజిక్కులకి వాళ్ళకి ఏం సమాధానాలు చెప్పాలో అర్ధం కావట్లేదు. దీంతో నెటిజన్లు కూడా ఆర్జీవికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

తాజాగా మరోసారి ఆర్జీవీ మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే ఈ సారి మంత్రి పేర్ని నానికి ట్విట్టర్‌ ద్వారా సినిమా టికెట్ల ధరలపై రాంగోపాల్‌ వర్మ ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మంత్రిని కోరాడు ఆర్జీవీ.

RGV : కరోనాని, వాళ్లను భరించాల్సిందే : ఆర్జీవీ

ఆర్జీవీ అడిగిన ప్రశ్నలు ఇవే..

సినిమా సహా ఏదైన ఉత్పత్తికి ధర నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఎంత ఉంటుంది?

అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోల రెమ్యునరేషన్ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు, రాబడిపైనే ఉంటుంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలి. మీకు అర్ధమవుయితుందా?

గోధుమలు, బియ్యం, కిరోసిన్ నూనె మొదలైన నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని సమతుల్యత కంటే దిగువన లేదా అంతకంటే ఎక్కువ ధరను నిర్ణయించవచ్చని నేను అర్థం చేసుకున్నాను, అయితే అది సినిమాలకు ఎలా వర్తిస్తుంది?

ఆహార ధాన్యాలలో కూడా బలవంతంగా ధర తగ్గించడం వల్ల రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారు, తద్వారా నాణ్యత లోపాన్ని సృష్టిస్తుంది. అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుంది. కాదంటారా?

పేదలకు సినిమా చాలా అవసరం అని మీకు అనిపిస్తే, మీరు ప్రభుత్వ జేబులోంచి బ్యాలెన్స్ చెల్లించి వైద్య, విద్యా సేవలకు ఎలా రాయితీలు ఇస్తున్నారో సినిమాలలో కూడా ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ ఇవ్వదు?

పేదలకు ప్రయోజనం చేకూర్చడానికి బియ్యం, పంచదార మొదలైనవాటిని అందించడానికి రేషన్ షాపులు సృష్టించబడ్డాయి, మీరు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా? అంటూ మరిన్ని ప్రశ్నలు అడిగిన ఆర్జీవీ వీటికి సమాధానం చెప్పాలన్నారు.

RGV : ఏపీ సినిమా టికెట్ల ధరలపై ఆర్జీవీ వ్యాఖ్యలు

అంతే కాక వీటికి ద్వంద్వ ధరల విధానంలో ఓ పరిష్కారం ఉంటుంది అని ఆర్జీవినే మరో ట్వీట్ చేశాడు. నిర్మాతలు వారి ధరకు టిక్కెట్‌లను విక్రయిస్తారు. ప్రభుత్వం కొన్ని టిక్కెట్‌లను కొనుగోలు చేసి పేదలకు తక్కువ ధరలకు అమ్మవచ్చు. అప్పుడు మేము మా డబ్బు సంపాదించుకుంటాం. మీరు మీ ఓట్లు పొందండి అంటూ వరుస ట్వీట్స్ చేశాడు. ఇప్పటికే ఆర్జీవీ అడిగిన వాటికి సమాధానాలు చెప్పలేక సైలెంట్ అయిపోయిన మంత్రులు మరి ఈ ట్వీట్లపై స్పందిస్తారా లేదా చూడాలి.