RGV : కరోనాని, వాళ్లను భరించాల్సిందే : ఆర్జీవీ

ఇటీవల ఈ విషయంపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా కామెంట్ చేశాడు. తాజాగా మరోసారి ఈ విషయంపై కామెంట్స్ చేసాడు ఆర్జీవీ. మరోసారి సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడుతూ.............

RGV : కరోనాని, వాళ్లను భరించాల్సిందే : ఆర్జీవీ

Rgv

RGV :   సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ప్రపంచంలో ఏ మూల ఏ విషయం జరిగినా దానిపై కామెంట్ చేస్తూ ఉంటాడు. అలాంటిది తన సినిమా ఇండస్ట్రీ గురించి తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉంటాడు. గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమలో ఏపీ సినిమా టికెట్ల ధరలు, ఏపీ థియేటర్ల మూసివేత హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా కామెంట్ చేశాడు. తాజాగా మరోసారి ఈ విషయంపై కామెంట్స్ చేసాడు ఆర్జీవీ.

ఇవాళ ఆర్జీవీ సినిమా ‘ఆశ ఎంకౌంటర్’ రిలీజ్ అయింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు ఆర్జీవీ. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రెస్ మీట్స్ లోనే ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమపై తీసుకుంటున్న నిర్ణయాలని వ్యతిరేకిస్తూ కామెంట్లు చేసాడు ఇప్పటికే. వందల కోట్లతో తీసిన సినిమా, కోటి రూపాయలతో తీసిన సినిమా టికెట్‌ను ఒకే ధరకు అమ్మడం అన్యాయం. ఏ వస్తువును ఎంత ధరకు కొనాలన్నది కొనుగోలుదారుడు, అమ్మకందారుడికి మధ్య ఉండే అవగాహన, అభిరుచులు, స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. ఎవరు ఏ ప్రోడక్ట్ తయారు చేసినా వాటి ధరని వాళ్ళే నిర్ణయిస్తారు. కాని సినిమా టికెట్ రేట్లని ప్రభుత్వం నిర్ణయించడం ఏంటని ఆర్జీవీ ప్రశ్నించారు.

Sudheer : మాస్ హీరోగా మారుతున్న సుధీర్.. యాక్షన్‌తో అదరగొట్టిన ‘గాలోడు’

తాజాగా మరోసారి సినిమా టికెట్ల వివాదంపై మాట్లాడుతూ.. దేనికైనా, ఎవరికైనా ఒక లిమిట్ ఉంటుంది. వాళ్లు ఏం చేస్తారు? ఏం చేయరు? అని చూస్తాం. కరోనాను మనం ఏమీ చేయలేం. అలాగే, ఏపీ ప్రభుత్వాన్ని కూడా ఏమీ చేయలేం. దాన్ని భరించినట్లే.. దీన్ని కూడా భరించకతప్పదు’ అంటూ వ్యాఖ్యలు చేశాడు ఆర్జీవీ.