Disha Patani: అందమైన ముఖాన్ని పాడుచేసుకున్నావా.. దిశాకి ట్రోలింగ్!

శా పటాని గుర్తుందా.. మెరుపుతీగలా కుర్రాళ్ళ కళ్లలో దూరిన పిల్ల కదా ఎలా మర్చిపోతాం అంటారా.. ఔను అది కూడా నిజమే. సహజంగా ఇలాంటి సన్నజాజి నాజూకు అందాలను ఎక్కడ ఉన్నా గాలిమేసి..

Disha Patani: అందమైన ముఖాన్ని పాడుచేసుకున్నావా.. దిశాకి ట్రోలింగ్!

Disha Patani

Disha Patani: దిశా పటాని గుర్తుందా.. మెరుపుతీగలా కుర్రాళ్ళ కళ్లలో దూరిన పిల్ల కదా ఎలా మర్చిపోతాం అంటారా.. ఔను అది కూడా నిజమే. సహజంగా ఇలాంటి సన్నజాజి నాజూకు అందాలను ఎక్కడ ఉన్నా గాలిమేసి లాక్కొచ్చే పూరి జగన్నాద్ లోఫర్ సినిమా కోసం ఈ అమ్మడిని టాలీవుడ్ కి పట్టుకొచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు దక్కించుకోవాలని అనుకున్నా అంతకు మించి అనేలా బాలీవుడ్ లోనే భారీ అవకాశాలను కొల్లగొడుతుంది. ప్రస్తుతం దిశా చేతిలో రెండు హిందీ సినిమాలున్నాయి.

Padutha Theeyaga: బాలు మానస పుత్రిక.. వారసుడే నాయకుడై.. మళ్ళీ సరికొత్తగా!

కాగా, తాజాగా సల్మాన్, తన బావ ఆయుష్ శర్మ కలిసి నటించిన అంతిమ్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ స్పెషల్ షోకు దిశా పటానీ కూడా హాజరై కెమెరాకు పోజులిచ్చింది. అయితే.. ఇక్కడే దిశా అడ్డంగా దొరికిపోయింది. సహజంగా దిశా అంటే బక్కచిక్కిన పాలకోవా పిల్లని చెప్పుకుంటారు బాలీవుడ్ జనాలు. అయితే.. ఈ స్పెషల్ స్క్రీనింగ్ షో ఈవెంట్ లో మాత్రం దిశా పేస్ లో ఏదో తేడా కొట్టేసినట్లుగా కనిపించింది. దీంతో దిశా పెదవులు, ముక్కుకు సర్జరీ చేయించుకుందని ప్రచారం మొదలైంది.

Bangarraju: శృతి మించిన బడ్జెట్.. సీక్వెల్ హిట్‌పైనే నాగ్ ఆశలన్నీ!

అంతేకాదు, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దిశాను ఆడేసుకుంటున్నారు. ‘సర్జరీతో ముఖాన్ని పాడు చేసుకున్న మరో హీరోయిన్‌’ అంటూ #waxstaue అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి తెగ ట్రోల్ చేస్తున్నారు. అలాగే ‘సర్జరీతో ఏమొచ్చింది.. అందంగా ఉన్న ముఖాన్ని అసహ్యంగా చేసుకున్నావ్‌’ అంటూ నెటిజన్లు దిశను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. అయితే.. అసలు నిజంగానే సర్జరీ లాంటిది చేయించుకుందా.. లేక అసలే ఉపవాసాల ఊర్వశి కదా అదే శృతి మించి అలా కనిపిస్తుందా అన్నది తెలియదు.