Padutha Theeyaga: బాలు మానస పుత్రిక.. వారసుడే నాయకుడై.. మళ్ళీ సరికొత్తగా!

పాడుతా తీయగా.. సంగీతాన్ని ఇష్టపడే ప్రేమికులకు, తెలుగు ప్రేక్షకులకు, గాయనీ గాయకులకు ఈ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 25 సంవత్సరాలుగా..

Padutha Theeyaga: బాలు మానస పుత్రిక.. వారసుడే నాయకుడై.. మళ్ళీ సరికొత్తగా!

Padutha Theeyaga

Padutha Theeyaga: పాడుతా తీయగా.. సంగీతాన్ని ఇష్టపడే ప్రేమికులకు, తెలుగు ప్రేక్షకులకు, గాయనీ గాయకులకు ఈ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 25 సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులతో అనుబంధం పెనవేసుకున్న ఈ కార్యక్రమం ద్వారానే ఎందరో సింగర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వందల మంది నూతన గాయనీ గాయకులు ఈ కార్యక్రమం నుంచి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవగా.. ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది స్టార్ సింగర్స్‌కు పునాదులు ఇక్కడే పడ్డాయి.

Bangarraju: శృతి మించిన బడ్జెట్.. సీక్వెల్ హిట్‌పైనే నాగ్ ఆశలన్నీ!

కాగా, పాడుతా తీయగా అనగానే మనకు గుర్తొచ్చేది ఒక్క బాలునే. గెస్ట్ జడ్జిలుగా ఎందరు వచ్చినా ఆ కుర్చీలో నిండుగా కనిపించేంది బాలుగారే. ఆయన అద్వర్యంలోనే ఈ స్వర యజ్ఞం పాతికేళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగింది. కానీ, ఇప్పుడు బాలుగారు మన మధ్య లేరు. ఊహించనివిధంగా ఆయన మరణించడంతో పాడుతా తీయగా కార్యక్రమం కొనసాగుతుందా.. ఆపేస్తారా అన్న అనుమానాలు కూడా ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చాయి. కానీ, ఆ అనుమానాలకు తెరదీసేలా వారసుడు చరణ్ బాలు మానస పుత్రిక పాడుతా తీయగా కార్యక్రమ బాధ్యతను తీసుకున్నాడు.

Sneha Ullal: ఉల్లాల ఉల్లాల.. ఉత్సాహంగా జూనియర్ ఐష్

మార్పులు చేర్పులతో మరో వారం రోజులలో (డిసెంబర్ 5)న ఈ కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. గతంలో హోస్ట్, జడ్జి అన్నీ తానై బాలు నడిపించేవారు. ఇప్పుడు ఎస్పీ చరణ్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా పూర్తి బాధ్యతను తీసుకోగా సింగర్ సునీత, సీనియర్ లిరిక్ రైటర్ చంద్రబోస్, ప్రముఖ గాయకుడు విజయ్ ప్రకాశ్ జడ్జిలుగా వ్యవహరించనున్నారు. కొత్త సీజన్ కోసం 4 వేల మందిని ఆడిషన్ చేసి అందులో 16 మందిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లోనే గాయకుల ఎంపిక జరిగింది. మరి బాలు లేని పాడుతా తీయగా ఎలా ఉండబోతుందో.. చరణ్ ఈ కార్యక్రమాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లగలడా అన్నది చూడాల్సి ఉంది.