DilRaju : F4 కూడా రెడీ చేస్తున్నాం.. త్వరలోనే అనౌన్స్..

గతంలోనే F4 కూడా ఉంటుందని అనిల్ రావిపూడి ప్రకటించారు. తాజాగా F3 సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…''కరోనా లాంటి నెగిటివ్ పరిస్థితులని దాటుకొని వచ్చి..........

DilRaju : F4 కూడా రెడీ చేస్తున్నాం.. త్వరలోనే అనౌన్స్..

F3

F4 Movie :  అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా మెహరీన్, తమన్నా హీరోయిన్స్ గా గతంలో వచ్చిన F2 సినిమా భారీ విజయం సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి తెగ నచ్చేసి 100 కోట్లకు పైగా కలెక్షన్లని తీసుకొచ్చింది. అందర్నీ నవ్వించింది ఆ సినిమా. దీంతో ఆ సినిమా విజయం ఇచ్చిన స్పూర్తితో F3 సినిమా చేశారు ఇదే టీం. ఇటీవలే విడుదల అయిన F3 సినిమా కూడా భారీ విజయం సాధించి ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లని వసూలు చేసి అందర్నీ నవ్విస్తుంది.

సినిమా రిలీజ్ అయి రెండు వారాలు అవుతున్నా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్, సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. గతంలోనే F4 కూడా ఉంటుందని అనిల్ రావిపూడి ప్రకటించారు. తాజాగా F3 సక్సెస్ మీట్ వైజాగ్ లో జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…”కరోనా లాంటి నెగిటివ్ పరిస్థితులని దాటుకొని వచ్చి ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఇంత భారీ విజయం సాధించడం చాలా ప్రత్యేకం. ఈ సినిమాను ఆడియెన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా చూసినంత సేపు నవ్వుకుంటున్నారు. ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లని ఇచ్చారు. మీరు ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి ‘F4’ కూడా రెడీ చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమాను ప్రకటిస్తాం” అని తెలిపారు.

Lokesh Kanagaraj : ఖైదీ 2.. సూర్య వర్సెస్ కార్తీ.. విక్రమ్ తో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు లోకేష్..

అయితే ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా చేయనున్నారు. ఈ సినిమా పూర్తయి రిలీజ్ అయ్యేవరకు రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టు F4 రావడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది అని అంచనా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా F4 రావాలని కోరుకుంటున్నారు.