Bimbisara: బింబిసారా కోసం రాజు గారి ఎంట్రీ!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బింబిసారా చిత్రాన్ని స్వయంగా రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్‌కు చిత్ర రైట్స్ కోసం ఫ్యాన్సీ రేటును కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.

Bimbisara: బింబిసారా కోసం రాజు గారి ఎంట్రీ!

Dil Raju To Release Kalyan Ram Bimbisara Movie

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట్ తెరకెక్కిస్తుండగా, హిస్టారికల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో ఫాంటెసీ అంశాలు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ మూవీలో నందమూరి కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన రోల్స్‌లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుండగా, ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి.

Bimbisara: తేనె పలుకులు పలికిస్తున్న బింబిసారా

ఇక ఇటీవల ఈ సినిమా ప్రివ్యూ చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, బింబిసారా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేసినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా బింబిసారా చిత్రాన్ని చూసినట్లుగా తెలుస్తోంది. ఆయనకు ఈ సినిమా తెగ నచ్చేసిందని, అందుకే వెంటనే ఈ సినిమాను ఆయనే స్వయంగా రిలీజ్ చేసేందుకు రెడీ అయినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేగాక, ఈ సినిమా రిలీజ్ కోసం ఆయన చిత్ర నిర్మాత అయిన కళ్యాణ్ రామ్‌కు ఈ చిత్ర రైట్స్ కోసం ఫ్యాన్సీ రేటును కూడా ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.

Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’లో ఎన్టీఆర్.. జోష్ లో నందమూరి అభిమానులు..

కానీ, ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రావాల్సి ఉంది. ఏదేమైనా కళ్యాణ్ రామ్ ప్రెస్టీజియస్ మూవీని ఇప్పుడు దిల్ రాజు రిలీజ్ చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హల్‌చల్ చేస్తుండటంతో ఈ సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.