Dimple Hayathi : ఒక్కపాట కోసం ఆరు కిలోల బరువు తగ్గిన హీరోయిన్

డింపుల్ హయతి మాట్లాడుతూ.. ''ఖిలాడీ సినిమాలో క్యాచ్ మీ పాట షూటింగ్ కు ముందు కాస్త లావుగా ఉన్నాను అనిపించడంతో దర్శకుడు రమేష్ వర్మ గారు బరువు తగ్గాలని చెప్పారు. ఆ ఒక్క పాట కోసం.......

Dimple Hayathi :  ఒక్కపాట కోసం ఆరు కిలోల బరువు తగ్గిన హీరోయిన్

Dimple Hayathi

Dimple Hayathi :   మాస్‌ మహారాజా రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘ఖిలాడీ’. రమేశ్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న అంటే ఈ రోజు విడుదల అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులని ఉర్రూతలూగించాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ డింపుల్ హయతి ఆసక్తికర విషయాలని తెలియచేసింది.

 

డింపుల్ హయతి మాట్లాడుతూ.. ”ఖిలాడీ సినిమాలో క్యాచ్ మీ పాట షూటింగ్ కు ముందు కాస్త లావుగా ఉన్నాను అనిపించడంతో దర్శకుడు రమేష్ వర్మ గారు బరువు తగ్గాలని చెప్పారు. ఆ ఒక్క పాట కోసం నేను బరువు తగ్గాను. నేను వర్కౌట్స్ చేస్తూ డైటింగ్ చేస్తూ ఏకంగా ఆరు కేజీల బరువు తగ్గాను. ఒక్క పాట కోసం ఆరు కేజీల బరువు తక్కువ టైంలో తగ్గడం అంటే మాములు విషయం కాదు. కానీ చాలా కష్టపడ్డాను అందుకోసం” అని తెలిపింది.

Ramesh varma : స్టేజిపైనే హీరోయిన్‌కి సారీ చెప్పిన ఖిలాడీ డైరెక్టర్

అలాగే సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ.. ”క్యాచ్ మీ పాటలో అందంగా కనిపించడం కోసం ట్రెండీ డ్రస్ లు వేశాను. సినిమా మొత్తంలో ఎక్కువ శాతం లంగా వోణి, చీరలోనే కనిపిస్తాను. సినిమాలో ఫైట్స్ ఉన్నప్పుడు తప్ప మిగతా సినిమా అంతా పూర్తిగా కనిపిస్తాను. సినిమాలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కినందుకు ఆనందంగా ఉంది. రవితేజతో చేసిన ఈ సినిమా నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది” అని తెలిపింది.