Director Bobby : లాక్ డౌన్ తర్వాత వాల్తేరు వీరయ్య కథ మారిపోయింది.. ముందు రాసుకున్న కథలో రవితేజ లేడు..

బాబీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఫ్యాన్ ని. ఇప్పుడు ఆయన సినిమా డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు ఇవి. లాక్ డౌన్ ముందు ఈ సినిమా కథ వేరు. కానీ లాక్ డౌన్ తర్వాత అందరి టేస్టులు మారిపోయాయి........

Director Bobby : లాక్ డౌన్ తర్వాత వాల్తేరు వీరయ్య కథ మారిపోయింది.. ముందు రాసుకున్న కథలో రవితేజ లేడు..

Director Bobby about waltair veerayya movie

Director Bobby :  మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ ముఖ్య పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఫుల్ మాస్ కామెడీ సినిమా చేస్తుండటంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. నేడు వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో గ్రాండ్ గా చేయనున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ కూడా చిరంజీవికి ఫ్యాన్ అని తెలిసిందే. ఒక ఫ్యాన్ తమ హీరోతో సినిమాని తీస్తే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య టైటిల్ ఎలా పెట్టారో తెలుసా??

బాబీ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి ఫ్యాన్ ని. ఇప్పుడు ఆయన సినిమా డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు ఇవి. లాక్ డౌన్ ముందు ఈ సినిమా కథ వేరు. కానీ లాక్ డౌన్ తర్వాత అందరి టేస్టులు మారిపోయాయి. ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు ఓటీటీకి కనెక్ట్ అయి అన్ని రకాల సినిమాలని చూస్తున్నారు. దీంతో కథ మారిస్తే బెటర్ అనిపించింది. చిరంజీవి గారికి చెప్తే ఓకే అన్నారు. ముందు రాసుకున్న కథలో రవితేజ లేడు. ఆ తర్వాత కథ మళ్ళీ మార్చి రవితేజ క్యారెక్టర్ పెట్టాను. ఒక ఫ్యాన్ గా, డైరెక్టర్ గా ఆలోచిస్తూ ఇద్దరి పాత్రలని కరెక్ట్ గా రాశాను. అందర్నీ అలరించాలని స్క్రిప్ట్ మార్చాను. ఇప్పుడు సినిమా ఇంకా బాగా వచ్చింది. చిరంజీవి గారు ఆల్రెడీ సినిమా చూసి సూపర్ హిట్ అవుతుందని చెప్పారు అని తెలిపాడు.