Waltair Veerayya : వాల్తేరు వీరయ్య టైటిల్ ఎలా పెట్టారో తెలుసా??

డైరెక్టర్ బాబీ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పాడు. బాబీ మాట్లాడుతూ.. వెంకిమామ సినిమా షూటింగ్ సమయంలో నాజర్ గారు నాకు..........

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య టైటిల్ ఎలా పెట్టారో తెలుసా??

how fix the waltair veerayya title said by director bobby

Waltair Veerayya :  మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా రవితేజ ముఖ్య పాత్రలో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఫుల్ మాస్ కామెడీ సినిమా చేస్తుండటంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. నేడు వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో గ్రాండ్ గా చేయనున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ కూడా చిరంజీవికి ఫ్యాన్ అని తెలిసిందే. ఒక ఫ్యాన్ తమ హీరోతో సినిమాని తీస్తే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

Rajamouli : ఎన్టీఆర్ ఐబ్రోస్‌తో కూడా నటించగలడు

డైరెక్టర్ బాబీ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పాడు. బాబీ మాట్లాడుతూ.. వెంకిమామ సినిమా షూటింగ్ సమయంలో నాజర్ గారు నాకు ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్ లో వీరయ్య అనే క్యారెక్టర్, అతని పేరు నాకు బాగా నచ్చింది. అప్పుడే మా టీంతో అన్నాను ఈ టైటిల్ తో ఒక సినిమా తీయాలని. అలాగే చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు ఆయన తండ్రి ఫ్రెండ్ డబ్బులిచ్చి ఫోటోలు తీయించాడని, ఆ ఫోటోలు పట్టుకొని మద్రాస్ వెళ్లానని గతంలో చాలా సార్లు చెప్పారు. ఆ డబ్బులిచ్చిన అతని పేరు కూడా వీరయ్యనే. ఇలా ఒకసారి ఆలోచించినప్పుడు వీరయ్య అనే పేరు ఈ కథలో హీరోకి అనుకున్నాను. చిరంజీవి మాస్ కి ఇది బాగా సరిపోతుందని ఫిక్స్ అయ్యాను. ఇక కథ వైజాగ్ లో జరుగుతుండటంతో వైజాగ్ కి ఉన్న ఇంకో పేరు వాల్తేరు అయితే బాగుంటుంది అనిపించి వాల్తేరు వీరయ్య అని పెట్టాము. ఈ టైటిల్ చిరంజీవి గారికి కూడా నచ్చడంతో ఇదే ఫిక్స్ చేసాం అని తెలిపాడు.