Kalyan Krishna : ‘బంగార్రాజు’లో నాగార్జున మనవడిగా చైతూ కనిపిస్తాడు

కళ్యాణ్ కృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ... 2016లో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన రోజే 'బంగార్రాజు' సినిమా చేయాలని నేను, నాగార్జున ఫిక్స్ అయ్యాం.

Kalyan Krishna : ‘బంగార్రాజు’లో నాగార్జున మనవడిగా చైతూ కనిపిస్తాడు

Bangarraju

Bangarraju :  ఈ సంక్రాంతికి నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విషయాలని వెల్లడించారు.

Ramesh Babu : నిర్మాతగా, నటుడిగా రమేశ్ బాబు సినిమాలు

కళ్యాణ్ కృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ… 2016లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన రోజే ‘బంగార్రాజు’ సినిమా చేయాలని నేను, నాగార్జున ఫిక్స్ అయ్యాం. ‘సోగ్గాడే చిన్న నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రాబోతోంది. సోగ్గాడే సినిమాలో ఎక్కడ ఎండ్ అయిందో ‘బంగార్రాజు’ అక్కడే మొదలవుతుంది. ఇందులో జనరేషన్ తేడా ఉంటుంది తప్ప బంగార్రాజు పాత్రలో తేడా ఉండదు. బంగార్రాజు మనవడిగా చైతూ కనిపిస్తారు. పెద్ద బంగార్రాజు పాత్ర ఎలా ఉండేదో చిన్న బంగార్రాజు పాత్ర కూడా అలానే ఉంటుంది. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకూడదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు ప్రతీ ఎమోషన్ సమానంగా ఉంటుంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఉన్నట్టుగా రమ్యకృష్ణ గారి పాత్ర కంటిన్యూ అవుతుంది” అని తెలిపారు.