Ramesh Babu : నిర్మాతగా, నటుడిగా రమేశ్ బాబు సినిమాలు

రమేశ్ బాబు కూడా కృష్ణ వారసత్వాన్ని తీసుకొని చాలా సినిమాల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిల్చిన..............

Ramesh Babu : నిర్మాతగా, నటుడిగా రమేశ్ బాబు సినిమాలు

Ramesh Babu Movies

Ramesh Babu :   సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు నిన్న రాత్రి మరణించారు. గతకొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

రమేశ్ బాబు కూడా కృష్ణ వారసత్వాన్ని తీసుకొని చాలా సినిమాల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిల్చిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు రమేశ్ బాబు. ఆ తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్, నీడ, పాలు నీళ్లు సినిమాల్లో బాలనటుడిగా నటించారు.

Ramesh Babu : రమేష్‌బాబుకు మృతిపై ఘట్టమనేని కుటుంబం విన్నపం

ఆ తర్వాత ‘సామ్రాట్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణ గారబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, నా ఇల్లే నా స్వర్గం, మామా కోడలు, అన్న చెల్లెలు, పచ్చ తోరణం సినిమాల్లో హీరోగా నటించారు. ‘శాంతి ఎనత్తు శాంతి’ అనే తమిళ్ సినిమాలో కూడా హీరోగా నటించారు. ‘ఎన్కౌంటర్’ అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.

Ramesh Babu: కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

ఆ తర్వాత ఆర్టిస్ట్ కెరీర్ కి స్వస్తి చెప్పి నిర్మాణ రంగంలోకి దిగారు. కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాతగా సినిమాలు నిర్మించారు. హిందీలో మొదటి సారి ‘సూర్యవంశం’ సినిమాని నిర్మించారు. ఆ తర్వాత తెలుగులో మహేశ్ బాబుతో అర్జున్, అతిధి, దూకుడు, ఆగడు సినిమాలు నిర్మించారు.