Agent Tina : విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనాగా చేసింది ఎవరో తెలుసా? ఆమె ఎంత ఫేమసో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

విక్రమ్ సినిమాలో పని మనిషిగా కనిపించి చివరలో ఏజెంట్ టీనా అని ఒక్కసారిగా విలన్ల మీద విరుచుకుపడిన ఈ క్యారెక్టర్ బాగా ఫేమస్ అయింది. దర్శకుడు ఇచ్చిన ఈ ట్విస్ట్ సినిమాకి మరింత ప్లస్ అయింది. ఈ క్యారెక్టర్ కి..............

Agent Tina : విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనాగా చేసింది ఎవరో తెలుసా? ఆమె ఎంత ఫేమసో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Agent Tina

Vikram :  కమల్‌ హాసన్‌ హీరోగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా విక్రమ్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పటికే దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా రోజుల తర్వాత కమల్ కి పెద్ద హిట్ రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ సినిమా యునిట్ కి గిఫ్ట్స్, పార్టీలు ఇస్తున్నారు. అయితే సినిమాలో మెయిన్ పాత్రలన్నిటితో పాటు బాగా హైలెట్ అయిన పాత్ర ఏజెంట్ టీనా.

 

విక్రమ్ సినిమాలో పని మనిషిగా కనిపించి చివరలో ఏజెంట్ టీనా అని ఒక్కసారిగా విలన్ల మీద విరుచుకుపడిన ఈ క్యారెక్టర్ బాగా ఫేమస్ అయింది. దర్శకుడు ఇచ్చిన ఈ ట్విస్ట్ సినిమాకి మరింత ప్లస్ అయింది. ఈ క్యారెక్టర్ కి కూడా బాగా పేరొచ్చింది. దీంతో ఈ టీనా పాత్ర చేసింది ఎవరా అని నెట్ లో వెతుకుతున్నారు ప్రేక్షకులు. ఏజెంట్ టీనా అసలు పేరు వాసంతి. ఈమె కోలీవుడ్ లో ప్రముఖ డాన్స్‌ కొరియోగ్రాఫర్. తమిళంలో చాలా సినిమాలకి, ఎంతో మంది స్టార్‌ హీరోల సినిమాలకు ఈమె కొరియోగ్రఫీ అందించింది. తమిళ్ లో ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ వాసంతి.

Ranbir Kapoor : మేం మండపంలోకి చెప్పులు వేసుకొనే వెళతాం.. బ్రహ్మాస్త్ర వివాదంపై స్పందించిన డైరెక్టర్..

లోకేష్ కనగరాజ్ తో ఉన్న పరిచయంతో లోకేష్ ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ చేయమని అడగగానే ఓకే చెప్పింది. వాసంతికి విక్రమ్ ఫస్ట్ సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే ఏజెంట్ టీనాగా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వాసంతి ఇదంతా మా డైరెక్టర్ వల్లే అని లోకేశ్‌ కనగరాజుకు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టింది. లోకేష్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ”విక్రమ్‌ లాంటి సినిమాలో నేను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజు గారికి కృతజ్ఞతలు. నా అసలు పేరు వాసంతి. కానీ ఇప్పుడు అందరూ నన్ను ఏజెంట్ టీనా అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులంతా నన్ను టీనాగా గుర్తిస్తున్నారు” అని పోస్ట్ చేసింది.