Ranbir Kapoor : మేం మండపంలోకి చెప్పులు వేసుకొనే వెళతాం.. బ్రహ్మాస్త్ర వివాదంపై స్పందించిన డైరెక్టర్..

అయాన్ ముఖర్జీ తన పోస్ట్ లో.. ''ఒక భక్తుడిగా, సినిమా దర్శకుడిగా అసలు ఏం జరిగిందో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. రణ్‌బీర్‌ కాళ్లకు షూలు వేసుకుని వెళ్ళింది ఆలయంలోకి కాదు, దుర్గాదేవి............

Ranbir Kapoor : మేం మండపంలోకి చెప్పులు వేసుకొనే వెళతాం.. బ్రహ్మాస్త్ర వివాదంపై స్పందించిన డైరెక్టర్..

Brahmastra

Brahmastra :  బాలీవుడ్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో మూడు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. రణబీర్, అలియా జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు స్టార్ సెలబ్రిటీలు సైతం నటిస్తున్నారు. ఈ సినిమాని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది సినిమా. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పటి నుంచే ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.

ఇటీవలే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అవ్వగా అందులోని ఓ సన్నివేశం వివాదానికి దారి తీసింది. ట్రైలర్ లో హీరో ఒక గుడి లోపలి వెళ్తూ షూస్ వేసుకొని ఉంటాడు, అలాగే షూస్ వేసుకొని గంట కొడతాడు. దీంతో షూస్ తో గుడిలోకి ఎవరైనా వెళ్తారా అంటూ సినిమాపై వ్యతిరేకత వచ్చింది. సినిమాని, రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. తాజాగా ఈ వివాదంపై ఆయన స్పందిస్తూ ఓ పోస్ట్ చేశారు.

Kiran Abbavaram : సమ్మతమే కథ ఇదేనా??

అయాన్ ముఖర్జీ తన పోస్ట్ లో.. ”ఒక భక్తుడిగా, సినిమా దర్శకుడిగా అసలు ఏం జరిగిందో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. రణ్‌బీర్‌ కాళ్లకు షూలు వేసుకుని వెళ్ళింది ఆలయంలోకి కాదు, దుర్గాదేవి పూజామండపంలోకి. 75 ఏళ్లుగా మా కుటుంబం దుర్గాదేవి పూజను నిర్వహిస్తోంది. నాకున్న అనుభవం బట్టి మేము మండపంలోకి కాళ్లకు చెప్పులు వేసుకునే వెళ్తాం. కానీ అమ్మవారి ముందుకు వెళ్లేటప్పుడు మాత్రం చెప్పులు తీసేసి దర్శనం చేసుకుంటాం. అక్కడ జరిగిందిదే. భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకే ఈ సినిమా తీశాం. అంతే కానీ ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదు” అని తెలిపాడు. మరి ఈ వివరణతో వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి.

View this post on Instagram

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)