Akhanda : ‘అఖండ’ సినిమాలో కనిపించిన ఎద్దుల గురించి తెలుసా ??
తన కోడెలకు సంబంధించిన కొన్ని వీడియోలను, ఫొటోలను డైరెక్టర్ బోయపాటికి చూపించాడు. బోయపాటికి అవి నచ్చి ముందు వాటితో కొన్ని టెస్టింగ్ సీన్స్ ను షూట్ చేసి బాలయ్యకు చూపించగా......
Akhanda : బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ‘అఖండ’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. మంచి మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. బాలయ్య బోయపాటితో పాటు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ని మెచ్చుకుంటున్నారు అంతా. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ పెంపుడు గిత్తలుగా హీరో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సీన్స్, యాక్షన్ సన్నివేశాల్లో రెండు ఎద్దులు ఆకట్టుకున్నాయి. వీటి వాళ్ళ ఆ యాక్షన్ సన్నివేశాలకు మరింత అందం, ఎలివేషన్ వచ్చింది.
Akhanda : ‘అఖండ’ సినిమా చూస్తూ డిస్ట్రిబ్యూటర్ మృతి
ఆ ఎద్దులు చౌటుప్ప ల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ అనే రైతువి. ఈయన తన వ్యవసాయ క్షేత్రంలో ఒక గోశాలను ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకమైన ఆవులు, కోడెలను పెంచుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం కృష్ణుడు, అర్జునుడు అనే రెండు కోడెలను కొనుగోలు చేశాడు. అవే ఈ సినిమాలో కనిపించిన ఎద్దులు. వాటికి వివిధ అంశాలపై శిక్షణ కూడా ఇచ్చారంట. ఎక్కడ ఉన్నా సరే పేరు పెట్టి పిలవగానే దగ్గరకు వచ్చేలా కూడా ట్రైనింగ్ ఇచ్చారట.
‘అఖండ’ సినిమాలో బసవన్నలకు సంబంధించిన ఎద్దుల కోసం చర్చ రాగా అప్పుడే శ్రీనివాస్ రామోజీ ఫిలింసిటీకి పర్సనల్ వర్క్ మీద వచ్చాడు. అక్కడ ‘అఖండ’ షూటింగ్ జరుగుతుందని తెలిసి చూడటానికి వెళ్ళాడు. అప్పుడు ఆ సినిమా కోసం ఎద్దుల గురించి వెతుకుతున్నారని తెలిసి శ్రీనివాస్ తన కోడెలకు సంబంధించిన కొన్ని వీడియోలను, ఫొటోలను డైరెక్టర్ బోయపాటికి చూపించాడు. బోయపాటికి అవి నచ్చి ముందు వాటితో కొన్ని టెస్టింగ్ సీన్స్ ను షూట్ చేసి బాలయ్యకు చూపించగా ఆయన ఓకే చెప్పడంతో వీటిని సినిమాలోకి తీసుకున్నారు.
Samantha : జీవితంలో చాలా నేర్చుకున్నా.. పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్ అంటున్న సమంత
గత ఏడాది చివరలో రామోజీ ఫిలింసిటీలో ఈ కోడెలు బాలయ్యతో పాటు షూటింగ్లో పాల్గొన్నాయి. సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్ లోనే కాకుండా క్లైమాక్స్, యాక్షన్ సీన్ లో కూడా అవి డైరెక్టర్ చెప్పినట్టు చేసి అద్భుతమైన ప్రదర్శన కనిపించాయి. ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు చాలా సంతోషించారు. ఇక వాటి యజమాని శ్రీనివాస్ కూడా తన అభిమాన హీరో బాలకృష్ణతో తెరపై తన ఎద్దులు కనిపించడం ఆనందంగా ఉందని చెప్పారు. షూటింగ్ జరిగినన్ని రోజులు వాటితో పాటు శ్రీనివాస్ కూడా షూట్ లొకేషన్ లోనే ఉన్నారంట.