Sarkaru Vaari Paata: ఇక ఆగడు.. ప్రమోషన్ల స్పీడ్ పెంచిన మహేశ్!

సినిమా చేయడం ఎంత ముఖ్యమో ప్రమోషన్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్. అదే స్టార్ హీరోలైతే ఏదో ఒక కొత్త అప్ డేట్ ఇస్తూ ఫాన్స్ ను ఎంగేజ్ చేసుకోవాలి. వాళ్ల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావాలి.

Sarkaru Vaari Paata: ఇక ఆగడు.. ప్రమోషన్ల స్పీడ్ పెంచిన మహేశ్!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సినిమా చేయడం ఎంత ముఖ్యమో ప్రమోషన్ చేయడం అంతకన్నా ఇంపార్టెంట్. అదే స్టార్ హీరోలైతే ఏదో ఒక కొత్త అప్ డేట్ ఇస్తూ ఫాన్స్ ను ఎంగేజ్ చేసుకోవాలి. వాళ్ల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావాలి. ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానుల కోసం, ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు సర్కార్ వారి పాట టీమ్.

Kajal Aggarwal: కాక రేపుతున్న కాజల్ అగర్వాల్!

ఈ వారం మహేష్ బాబు అభిమానులకు పండగ కానుంది. ఈ ప్రేమికుల రోజున హీరో మహేష్ బాబు నుంచి రాబోయే సినిమా సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు, రాబోయే రోజుల్లో అప్‌డేట్‌ల వర్షం కురుస్తుందని సినిమా టీమ్ ఎనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 7 నుంచి థమన్ కంపోజ్ చేసిన మొదటి సింగిల్ గురించి 4 అప్ డేట్స్ రిలీజ్ కానున్నాయి. ఫిబ్రవరి 7, 9, 11, 14 తేదీలలో ఈ అప్డేట్స్ రానున్నాయి.

Irra Mor: అందాల దాడికి దిగిన వర్మ బ్యూటీ మోర్

ఇయర్ కి ఒక హిట్ చొప్పున సక్సెస్ ప్లాన్ గీసుకున్న మహేశ్ బాబు ఆ ప్లాన్ లో మూడు హిట్స్ ఇచ్చి సక్సెస్ అయ్యాడు 2020లో సరిలేరు నీకెవ్వరు తర్వాత, 2021లో సర్కార్ వారి పాట హిట్ ఇవ్వాలనుకున్నాడు. మహేశ్ బాబు మైత్రీ మూవీస్ మేకర్స్ తో కలసి, పరుశురామ్ డైరెక్షన్ లో 2020 నవంబరులో సర్కార్ వారి పాట షూటింగ్ స్టార్ట్ చేశాడు. 2021 జనవరి నుంచి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ.. మహేష్ కెరీర్లో కోవిడ్ పెద్ద బ్యాంగ్ ఏసింది. తన ప్లాన్ ను తలకిందులు చేసింది. దాంతో ఓ ఇయర్ సినిమాలే రిలీజ్ కాకుండా గడచిపోయింది.

Khiladi: ఈ వారమే ఖిలాడీ రిలీజ్.. ప్రమోషన్ల హడావుడి లేదేంటి?

60 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్ సంవత్సరం కింద రిలీజ్ అయింది. టీజర్ 5 నెలల కింద విడుదలైంది. ఎట్ లీస్ట్ ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మహేశ్ బాబు కరోనా భారిన పడి ఫైనల్ షూటింగ్ ఢిలే అయ్యింది. ఎట్టకేలకు పట్టాలెక్కిన సర్కార్ వారి పాట షూటింగ్ ఫైనల్ వర్క్స్ ఫినిష్ చేసుకుంటుంది. మే 12న భారీగా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో దూసుకెళ్లడానికి ఫిబ్రవరి 7 నుంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అదనపు ఆకర్షణ కానుంది.