Dulquer Salmaan : తెలుగులో పాతుకుపోతున్న దుల్కర్..

హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ చేస్తున్న సీతారామం.. యుద్దం రాసిన ప్రేమ కథ సినిమాతో ఆగస్ట్ 5న ఆడియన్స్ ముందుకొస్తున్నారు దుల్కర్. తెలుగులో దుల్కర్ కి ఇంత క్రేజ్ ఉంది కాబట్టే సోలో హీరోగా..........

Dulquer Salmaan : తెలుగులో పాతుకుపోతున్న దుల్కర్..

Dulqer

Dulquer Salmaan :  బేసిక్ గా మళయాళ హీరో అయినా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. తెలుగులోకి తక్కువ సినిమాలు డబ్ అయినా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సూపర్ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు డైరెక్ట్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. నాన్ తెలుగు హీరోల్లో సూర్య తర్వాత అంత క్రేజ్ సంపాదించుకుంటున్నారు దుల్కర్ సల్మాన్.

ఇంటెన్స్ లుక్స్ తోనే, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. మళయాళ హీరో అయినా ఈ మెస్మరైజింగ్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగు ఫ్యాన్ బేస్ ని సంపాదించుకోవడం అంత ఈజీకాదు. కానీ ఓకే బంగారం, కనులుకనులను దోచాయంటే, మహానటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నారు టాలీవుడ్ లో. ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నారు.

Samyuktha Menon : బింబిసారే ముందు.. ఆ తర్వాతే భీమ్లానాయక్..

హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ చేస్తున్న సీతారామం.. యుద్దం రాసిన ప్రేమ కథ సినిమాతో ఆగస్ట్ 5న ఆడియన్స్ ముందుకొస్తున్నారు దుల్కర్. తెలుగులో దుల్కర్ కి ఇంత క్రేజ్ ఉంది కాబట్టే సోలో హీరోగా ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమాకే బాగా హైప్ సంపాదిస్తున్నాడు. ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. చిత్ర యూనిట్ చేసే ప్రతి ఈవెంట్ కి దుల్కర్ హాజరవుతున్నారు. దీంతో తెలుగులో మార్కెట్ సంపాదించాలని, ఇక్కడ కూడా సినిమాలు వరుసగా తీయాలని ఫిక్స్ అయ్యారు దుల్కర్. లేదా తన మలయాళ సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసుకోడానికి ఈ క్రేజ్ పనికొస్తుందని భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ లాగే ఈ మలయాళ స్టార్ కూడా తెలుగులో మార్కెట్ కోసం తాపత్రయపడుతున్నారు. సీతారామం సినిమా సౌత్ భాషల్లో రిలీజ్ అవుతుంది.