Samyuktha Menon : బింబిసారే ముందు.. ఆ తర్వాతే భీమ్లానాయక్..

సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ''ఒకప్పుడు ఏదైనా ఉద్యోగంలో సెటిల్ అయితే చాలు అనుకునే దాన్ని. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. నా ఫస్ట్ సినిమా ‘పాప్‌కార్న్‌’ చూసి నాకు.........

Samyuktha Menon : బింబిసారే ముందు.. ఆ తర్వాతే భీమ్లానాయక్..

Samyuktha

Samyuktha Menon :  భీమ్లా నాయక్ సినిమాలో రానా సరసన కనిపించి మెప్పించిన సంయుక్త మీనన్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. బింబిసార సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది సంయుక్త.

సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ”ఒకప్పుడు ఏదైనా ఉద్యోగంలో సెటిల్ అయితే చాలు అనుకునే దాన్ని. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. నా ఫస్ట్ సినిమా ‘పాప్‌కార్న్‌’ చూసి నాకు నటన రాదన్నారు చాలా మంది. ఆ తర్వాత సినిమా గురించి, అందులో అన్ని విభాగాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఇప్పుడు సినిమానే నాకు లోకమైంది. నాకు పీరియాడిక్‌ సినిమాలంటే ఇష్టం. ‘బాహుబలి’, ‘బాజీరావ్‌ మస్తానీ’.. ఇలాంటి సినిమాలు చాలా నచ్చుతాయి. నాకు మొదట ‘బింబిసార’ కథ చెప్పినప్పుడు ఇలాంటి కథే కావడంతో ఒప్పేసుకున్నాను. బింబిసార పార్ట్ 1 కంటే పార్ట్ 2లో నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది.”

Syamala : యాకర్ శ్యామల కొత్త ఇల్లు చూశారా??.. ఎంత బాగుందో..

”మొదట్లో తెలుగు పరిశ్రమ నుంచి ఆఫర్స్ వచ్చినా కథలు నచ్చక ఓకే చెప్పలేదు. నేను తెలుగులో మొదట ఓకే చేసిన సినిమా బింబిసారనే ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్‌ 15వ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ రెండు ఒప్పుకున్నాను. ఇవి కరోనా కంటే ముందే ఓకే అయ్యాయి. ఇవి మొదలవుతున్న సమయంలోనే ‘భీమ్లానాయక్‌’ ఛాన్స్ వచ్చింది. అది అవ్వగానే అదే బ్యానర్‌లో ధనుష్ తో ‘సార్‌’ సినిమాలో కూడా నటిస్తున్నాను. బింబిసార నేను తెలుగులో మొదట ఒప్పుకున్న సినిమా కాని భీమ్లా నాయక్ ఫస్ట్ రిలీజ్ అయింది. సాయిధరమ్ తేజ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. అందుకోసం భాష కూడా నేర్చుకుంటాను. టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేటప్పుడే ట్యూటర్ ని పెట్టుకొని తెలుగు నేర్చుకున్నాను. ఇప్పుడు మలయాళంతో పాటు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి” అని తెలిపింది.