Aha: దసరా టూ సంక్రాంతి.. ప్రేక్షకులకు నాన్ స్టాప్ పండగే!

ఒరిజినల్ తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లలో దూసుకుపోతుంది. కరోనా లాక్ డౌన్ లో..

Aha: దసరా టూ సంక్రాంతి.. ప్రేక్షకులకు నాన్ స్టాప్ పండగే!

Aha

Aha: ఒరిజినల్ తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్ లలో దూసుకుపోతుంది. కరోనా లాక్ డౌన్ లో ప్రేక్షకులు డిజిటల్ ప్రసారాల వైపు మొగ్గు చూపడం ఎక్కువవడంతో ఆహా కూడా సరికొత్తగా అలరిస్తుంది. సందర్భాన్ని బట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ఉండే ఆహా ఇప్పుడు దసరాను టార్గెట్ చేసి వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.

Aditi Rao Hydari: అదితి ఆశలు.. ఈసారి హిట్టు కొడతానంటున్న హైదరాబాదీ!

ఆహా వీడియో దసరా నుండి సంక్రాంతి వరకు నాన్ స్టాప్ వినోదాల పండుగకి సిద్దం అయ్యింది. మొత్తం 12 వారాలు, 90 రోజులు, 20 కొత్త సినిమాలు మరియు షో లతో ఆహా వీడియో ప్రేక్షకులను చూపు తిప్పుకోకుండా చేసేందుకు సిద్ధమైంది. దసరా నుండి సంక్రాంతి పండుగ వరకూ అదిరిపోయే నాన్ స్టాప్ 100 శాతం తెలుగు వినోదాల పండుగ మీ ఆహాలో సిద్దమా అంటూ ఆహా వీడియో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది.

Big Boss 5: లోబో పొట్టపై సెటైర్లు.. యానీ మాస్టర్ ఉగ్రరూపం!

మొత్తం 90 రోజుల ఎంటర్టైన్మెంట్ షెడ్యూల్ లో ఇప్పుడు ఇంకా విడుదల కానీ సినిమాలతో పాటు ఈ మూడు నెలలలో విడుదలయ్యే కొత్త సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అఖిల్ అక్కినేని-పూజ హెగ్డేల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగ చైతన్య-సాయి పల్లవిల లవ్ స్టోరీ, నాగ శౌర్య లక్ష్య, రాజ్ తరుణ్ అనుభవించు రాజా, వరుణ్ తేజ్ గని, పూరి తనయుడు ఆకాష్ రొమాంటిక్‌లతో పాటు డీజే తిల్లు, పుష్పక విమానం, మంచి రోజులొచ్చాయి సినిమాలు కూడా ఉన్నాయి.

Hamida Khatoon: హమీదా.. నీ అందానికి కుర్రకారు ఫిదా!

కొత్త సినిమాలతో పాటు సేనాపతి, భామా కలాపం, అన్యస్‌ టుటోరియాల్‌, 3 రోజెస్‌, అడాల్టింగ్‌, ఇట్‌ ఈజ్‌ నాట్‌ ఎ లవ్‌స్టోరీ, ఇంటింటి రామాయణం, సెగు టాకీస్‌, కూబూల్‌ హై, సర్కార్‌ వంటి ఒరిజినల్స్ కూడా ఆహా తీసుకొస్తుంది. సినిమాలతో పాటు సరికొత్త షోలు కూడా ప్లాన్ చేస్తున్న ఆహా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే టాక్‌షో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే నుండే ఈ సినిమా పండగకి సిద్దమైపొండి.