Aditi Rao Hydari: అదితి ఆశలు.. ఈసారి హిట్టు కొడతానంటున్న హైదరాబాదీ!

అదితిరావ్ హైదరీ.. ముట్టుకుంటే మాసిపోయేంత అందం ఈహీరోయిన్ సొంతం. నార్త్ లో సినిమాలు చేస్తున్నా.. బేసిక్ గా సౌత్ హీరోయిన్. క్యూట్ ఫేస్ తో అంతకన్నా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్..

Aditi Rao Hydari: అదితి ఆశలు.. ఈసారి హిట్టు కొడతానంటున్న హైదరాబాదీ!

Aditi Rao Hydari

Aditi Rao Hydari: అదితిరావ్ హైదరీ.. ముట్టుకుంటే మాసిపోయేంత అందం ఈహీరోయిన్ సొంతం. నార్త్ లో సినిమాలు చేస్తున్నా.. బేసిక్ గా సౌత్ హీరోయిన్. క్యూట్ ఫేస్ తో అంతకన్నా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే అదితి ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేస్తున్నా ఇప్పటి వరకూ సక్సెస్ మాత్రం సరిగా రాలేదు. ఈ సారి మాత్రం మహా సముద్రంతో పక్కా సక్సెస్ కొడతానంటోంది ఈ హైదరాబాదీ హీరోయిన్.

Siddharth: సిద్దూ రీఎంట్రీ.. మళ్ళీ బిజీ అవుతాడా?

సమ్మోహనం సినిమాలో హీరోయిన్ అదితిని చూడగానే అబ్బ ఎంత అందంగా ఉంది.. అద్బుతంగా యాక్ట్ చేస్తోంది అనుకున్నారు. తీరా ఆరా తీస్తే తెలుగునేటివిటీ ఉన్న అమ్మాయే అని తెలుసుకుని తెగ ఆనందపడిపోయారు మన వాళ్లు. అయితే తెలుగులో కన్నా.. నార్త్ లోనే ఎక్కువ సినిమాలు చెయ్యడంతో తెలుగులో పెద్దగా ఎలివేట్ కాలేదు అదితి. అయితే ఈ సారి మాత్రం మహాసముద్రంలో మహా క్యారెక్టర్ తో కమ్ బ్యాక్ అవుతోంది అదితి.

ChaySam BreakUP: చైతూ సమంత బ్రేకప్.. హీరో సిద్ధార్థ్ ట్వీట్ వైరల్!

అదితి రావ్ హైదరీ హీరోయిన్ కంటే మంచి పర్ఫామర్. సెన్సిబుల్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడంలో అదితి తర్వాతే ఎవరైనా. అంత మంచి యాక్టింగ్ టాలెంట్ ఉన్నా.. ఎక్కడా సరైన సక్సెస్ సంపాదించుకోలేకపోయింది. కానీ అజయ్ భూపతి డైరెక్షన్లో ఈ 14న రిలీజ్ అవుతున్న మహాసముద్రం గ్యారంటీ గా సక్సెస్ అవుతుందని, ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నానని అంటోంది అదితి.

Maha Samudram: షూటింగ్ పూర్తి.. సిద్దూ ఆశలన్నీ శర్వా పైనే!

అదితి ఇంతకుముందు నానితో ‘వి’ సినిమాతో పాటు సుధీర్ బాబుతో సమ్మోహనం సినిమా చేసింది. సమ్మోహనం తర్వాత అంతరిక్షం సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసింది అదితి. ఇలా రెండు మూడు సినిమాలు చేసినా అనుకున్నంత గుర్తింపురాలేదు ఈ హీరోయిన్ కి. కానీ మహా సముద్రంలో తను చేసిన మహా క్యారెక్టర్ తో మంచి బ్రేక్ వస్తుందని.. ఫుల్ హోప్స్ తో ఉంది ఈ క్యూట్ హీరోయిన్.