Siddharth: సిద్దూ రీఎంట్రీ.. మళ్ళీ బిజీ అవుతాడా?

ఒకప్పుడు తెలుగు సినిమాకు లవర్ బాయ్ గా దూసుకెళ్లిన సిద్దార్థ్.. తమిళంలో కూడా భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. ఎప్పుడో పదేళ్లే క్రితమే బాలీవుడ్ లో కూడా రంగ్ దే బసంతి లాంటి హిట్ కొట్టిన..

Siddharth: సిద్దూ రీఎంట్రీ.. మళ్ళీ బిజీ అవుతాడా?

Siddarth

Siddharth: ఒకప్పుడు తెలుగు సినిమాకు లవర్ బాయ్ గా దూసుకెళ్లిన సిద్దార్థ్.. తమిళంలో కూడా భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. ఎప్పుడో పదేళ్లే క్రితమే బాలీవుడ్ లో కూడా రంగ్ దే బసంతి లాంటి హిట్ కొట్టిన సిద్దార్థ్.. ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించాడు. ముఖ్యంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓయ్, బావా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్ధ్ ఈ మధ్య కాస్త వెనకబడ్డాడు. ఇంకా చెప్పాలంటే చాలాకాలంగా తెలుగుకు దూరమయ్యాడు సిద్దూ.

Mahasamudram: రంభ అభిమానిగా జగ్గూభాయ్.. కటౌట్స్ తో స్పెషల్ సాంగ్!

కాగా, ఇప్పుడు మళ్ళీ శర్వానంద్ తో కలిసి మహాసముద్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మహాసముద్రం ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేయగా ఈ సినిమాతో మరోసారి తెలుగులో సిద్దూ బిజీ కావాలని గట్టి ఆశలే పెట్టుకున్నాడు. మహాసముద్రం ప్రీ రిలీజ్ వేడుక వేదికపై కూడా సిద్దూ తెలుగు ఇండస్ట్రీ మీద తన ప్రేమను బయటపెడుతూనే తెలుగు ప్రేక్షకులు తన నుండి ఎవరూ దూరం చేయలేరని ఎమోషనల్ అయ్యాడు.

‘మ‌హాస‌ముద్రం’తో టాలీవుడ్‌కు తిరిగొస్తున్న సిద్ధార్థ్‌

మహాసముద్రం మీద భారీ ఆశలే పెట్టుకున్న సిద్దూ ఈ సినిమా తరువాత వరసగా తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. అయితే.. గతంలో సిద్దూకి ఉన్న స్కోప్ ఇప్పుడు తెలుగులో ఉంటుందా అన్నదే ప్రశ్న. ఈ మధ్య యంగ్ హీరోలు విభిన్నమైన కథలతో స్క్రీన్ కబ్జా చేసేస్తున్నారు. మరోవైపు శర్వా లాంటి హీరోలు ఆచితూచి తన స్టార్ స్టేటస్ నిలుపుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సిద్దూ మళ్ళీ తెలుగులో నిలబడాలంటే గట్టిగానే కష్టపడాలి. మరి.. సిద్దూ రీ ఎంట్రీ ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.