Mahasamudram: రంభ అభిమానిగా జగ్గూభాయ్.. కటౌట్స్ తో స్పెషల్ సాంగ్!

ఈ మధ్య కాలంలో మన సినిమాలో హీరోలు మరో హీరోకు అభిమానులుగా కనిపిస్తున్నారు. కథలో పాత్ర పరంగా మరో హీరోకు అభిమానులని చెప్పుకోవడంతో ఆ స్టార్ హీరో అభిమానులు కూడా సినిమాకు తోడై మార్కెట్ పరంగా కలిసి వస్తుంది.

Mahasamudram: రంభ అభిమానిగా జగ్గూభాయ్.. కటౌట్స్ తో స్పెషల్ సాంగ్!

Mahasamudram

Mahasamudram: ఈ మధ్య కాలంలో మన సినిమాలో హీరోలు మరో హీరోకు అభిమానులుగా కనిపిస్తున్నారు. కథలో పాత్ర పరంగా మరో హీరోకు అభిమానులని చెప్పుకోవడంతో ఆ స్టార్ హీరో అభిమానులు కూడా సినిమాకు తోడై మార్కెట్ పరంగా కలిసి వస్తుంది. అయితే.. జగ్గూభాయ్ మాత్రం హీరోకు కాకుండా హీరోయిన్ కు అభిమానిగా కనిపించనున్నాడట. జగపతి బాబు హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా మారిన తర్వాత మంచి మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రానున్న మహాసముద్రం సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఆర్ఎక్స్-100 దర్శకుడు అజయ్ భూపతి చాలా కాలంగా వెయిట్ చేసి మహాసముద్రం సినిమాను మొదలుపెట్టాడు. శర్వానంద్, సిద్దార్ధ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అదితీరావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నాడు. మరో ముఖ్య పాత్రలో జగపతి బాబు నటిస్తుండగా ఆయన సీనియర్ హీరోయిన్ రంభకు వీరాభిమానిగా నటిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో రంభ కటౌట్స్ తోనే స్పెషల్ సాంగ్ ఉంటుందట.

నిజానికి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ను ఎవరైనా స్టార్ హీరోయిన్ తో చేయించాలని అనుకున్నారట. అందుకోసం రకుల్, పూజ, కాజల్, శృతిహాసన్ వంటి హీరోయిన్స్ ను సంప్రదించినా వర్క్ అవుట్ కాలేదట. దీంతో ఎలాగూ జగపతి బాబు రంభకు వీరాభిమాని కాగా రంభ కటౌట్స్ తోనే పాట షూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే ఈ పాట షూటింగ్ కూడా పూర్తిచేయగా అనుకున్నదాని కంటే పాట మరింత బాగా వచ్చిందని టాక్ నడుస్తుంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఫోటోలతో విజయశాంతి మీద, నందమూరి హరికృష్ణ ఫోటోలతో సిమ్రాన్ మీద ఇలాంటి పాటల చిత్రీకరణ జరగగా హీరోయిన్ ఫోటోలతో స్పెషల్ సాంగ్ చేయడం మాత్రం ఇదే తొలిసారి. మరి ఈ పాట ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.