Chiranjeevi : 70 ఏళ్ళ ఏజ్‌లో జిమ్‌లో మెగాస్టార్ కష్టాలు.. 158వ సినిమా కోసం.. ముహూర్తం ఎప్పుడంటే?
చిరంజీవి జిమ్ లో కష్టపడుతున్న వీడియోని రిలీజ్ చేసారు.(Chiranjeevi)
Chiranjeevi
Chiranjeevi : ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తన 158వ సినిమా మొదలుపెట్టబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.
చిరంజీవి జిమ్ లో కష్టపడుతున్న వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియో చూస్తే చిరు జిమ్ లో ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో తెలుస్తుంది. 70 ఏళ్ళ వయసులో ఇంకా యంగ్ గా కనిపిస్తూ ఈ రేంజ్ లో కష్టపడటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా నా నెక్స్ట్ సినిమా కోసమే అనే బాబీతో చేయబోతున్న సినిమా గురించి తెలిపారు. ఆ సినిమా మే 21న ఓపెనింగ్ పూజ కార్యక్రమం జరుపుకుంటుంది ప్రకటించారు.
ఆల్రెడీ బాబీ దర్శకత్వంలో చిరు వాల్తేరు వీరయ్య సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని తమిళ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. చిరంజీవి జిమ్ లో కష్టపడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
మీరు కూడా ఆ వీడియో చూసేయండి..
Every day is another opportunity to push beyond limits…
Charged up and excited for another memorable journey with my dear @dirbobby for #Mega158 🤗
Opening Ceremony on May 21st ✨#ChiruBobby2 @KvnProductions pic.twitter.com/tTuu8YyA9d
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 17, 2026
