Chiranjeevi Gym Video: 70 ఏళ్ళ ఏజ్‌లో జిమ్‌లో మెగాస్టార్ కష్టాలు.. 158వ సినిమా కోసం.. ముహూర్తం ఎప్పుడంటే?

చిరంజీవి జిమ్ లో కష్టపడుతున్న వీడియోని రిలీజ్ చేసారు.(Chiranjeevi)

  • Updated on- May 18, 2026 / 06:24 PM IST

Chiranjeevi Gives Mega 158 Update While Sharing His Gym Video

Chiranjeevi Gym: ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తన 158వ సినిమా మొదలుపెట్టబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు.

చిరంజీవి జిమ్ లో కష్టపడుతున్న వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియో చూస్తే చిరు జిమ్ లో ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో తెలుస్తుంది. 70 ఏళ్ళ వయసులో ఇంకా యంగ్ గా కనిపిస్తూ ఈ రేంజ్ లో కష్టపడటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా నా నెక్స్ట్ సినిమా కోసమే అనే బాబీతో చేయబోతున్న సినిమా గురించి తెలిపారు. ఆ సినిమా మే 21న ఓపెనింగ్ పూజ కార్యక్రమం జరుపుకుంటుంది ప్రకటించారు.

Also Read : Keneeshaa Francis : అసలు ఎవరీ కెనీషా..? 18 ఏళ్లకే పెళ్లి, 19 ఏళ్లకు గర్భస్రావం.. జయంరవి లైఫ్ లోకి వచ్చి.. ఇప్పుడు అన్ని వదిలేసి..

ఆల్రెడీ బాబీ దర్శకత్వంలో చిరు వాల్తేరు వీరయ్య సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని తమిళ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. చిరంజీవి జిమ్ లో కష్టపడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

మీరు కూడా ఆ వీడియో చూసేయండి..