Kishan Reddy – Bandi Bhagirath: బండి భగీరథ్ కేసు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వెస్ట్ బెంగాల్ కు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వెళితే పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు కిషన్ రెడ్డి.
Kishan Reddy – Bandi Bhagirath: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. భగరీథ్ అరెస్ట్ అయ్యారని, ఇక ఇందులో ఇష్యూ ఏమీ లేదన్నారు. భగీరథ్ పోక్సో కేసు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది అని కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ కు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వెళితే పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు కిషన్ రెడ్డి.
అతడు సరెండర్ అయ్యాడు. ఇక ఇష్యూ ఏముంది. స్టేట్ గవర్నమెంట్, పోలీస్.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పోలీస్ వ్యవస్థ వేర్వేరుగా ఉంటుంది. నాటు వెస్ట్ బెంగాల్ లో మా అమిత్ షా విమానం దిగుతానే రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమానం దిగుతా అంటే స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే పక్కనున్న ఒడిశా రాష్ట్రంలో దిగి ఆయన రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు సంబంధించినటు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుంది. పూర్తి దర్యాఫ్తు చేసి ఏ చర్య అయినా తీసుకునే అధికారం వారికే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి ప్రమేయం ఉండదు” అని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి.
Also Read: చర్లపల్లి జైలుకు బండి భగీరథ్.. 14రోజులు రిమాండ్.. నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్
