Flipkart Sasa Lele Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్ ముగుస్తోంది.. ఈరోజే లాస్ట్ ఛాన్స్.. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లపై బెస్ట్ డీల్స్ మిస్ అవ్వకండి..!
Flipkart Sasa Lele Sale : ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ మే 17తో ముగియనుంది. ఈ రోజు రాత్రి 12 గంటల్లోగా మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్లు, మరెన్నో టాబ్లెట్లపై అద్భుతమైన డిస్కౌంట్లతో కొనేసుకోవచ్చు. పూర్తి సేల్ వివరాలివే..
Flipkart Sasa Lele Sale
- ఈ రోజు రాత్రి 12 గంటల లోపు అద్భుతమైన ఆఫర్లకు ఇదే లాస్ట్ ఛాన్స్
- శాంసంగ్, వివో, ఒప్పో, రెడ్మి బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
- ఎస్బీఐ కార్డ్ యూజర్ల కొనుగోళ్లపై మరిన్ని అదనపు తగ్గింపు ఆఫర్లు
Flipkart Sasa Lele Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ మే 17తో ముగుస్తోంది. ఈరోజే చివరి రోజు. ఈ సేల్ ఈ రాత్రి 12 గంటలకు ముగియనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్ల నుంచి అనేక యాక్సెసరీల వరకు అనేక రకాల ప్రొడక్టులపై భారీ తగ్గింపులు (Flipkart Sasa Lele Sale) అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఈ సేల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, టాబ్లెట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు కొనుగోలు చేసేందుకు మీకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ అర్ధరాత్రి లోపు అద్భుతమైన డీల్స్ పొందడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ సేల్‌లో శాంసంగ్, వివో, ఒప్పో, రెడ్మి వంటి పాపులర్ కంపెనీల స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
మీకు నచ్చిన ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలంటే బ్యాంక్ ఆఫర్లు కూడా వాడుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్టుల కొనుగోలుపై ఎస్బీఐ కార్డ్ యూజర్లు అదనపు డిస్కౌంట్లు పొందవచ్చు. కూపన్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా పొందవచ్చు.
ఈరోజే లాస్ట్ ఛాన్స్.. డోంట్ మిస్ :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చౌకైన స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్. లో-మిడ్‌రేంజ్, బడ్జెట్ స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపులతో లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు.. శాంసంగ్ గెలాక్సీ M34, పోకో M6 ప్రో వంటి స్మార్ట్ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.
వివో T3x ఫోన్లు కూడా చౌకైన ధరకే లభ్యమవుతున్నాయి. బ్యాంక్ ఆఫర్లతో సహా ఈ సేల్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నింటినీ రూ. 15వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 చాలా తక్కువ ధరకే లభిస్తోంది.
ఈ సేల్‌లో ఒప్పో K14x 5జీ ఫోన్ రూ. 14,499కి పొందవచ్చు. రియల్‌మి P4x 5జీని రూ. 18,999కి కొనేసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ కేటగిరీ విషయానికి వస్తే.. ఐఫోన్ 17ని రూ. 79,900కి సొంతం చేసుకోవచ్చు.
అదే సమయంలో శాంసంగ్ గెలాక్సీ S25ని ఈ సేల్‌లో రూ. 56,999కి పొందవచ్చు. వివో X200T 5జీ బెస్ట్ డీల్ పొందవచ్చు. ఈ అద్భుతమైన ఫోన్‌ను రూ. 49,999కి కొనుగోలు చేయవచ్చు. ఇతర ప్రొడక్టులపై కూడా భారీ తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. త్వరపడండి..
