DVV Danayya : 2006లో రాజమౌళికి అడ్వాన్స్ ఇస్తే.. ఇప్పుడు RRR తీశాడు.. నిర్మాత దానయ్య వ్యాఖ్యలు..

ఇటీవల ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత దానయ్య మీడియాతో మాట్లాడుతూ.. RRR సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో నేను కాంటాక్ట్ లో లేను. కానీ నేను నిర్మించిన సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నాను అని తెలిపారు. దీంతో............

DVV Danayya : 2006లో రాజమౌళికి అడ్వాన్స్ ఇస్తే.. ఇప్పుడు RRR తీశాడు.. నిర్మాత దానయ్య వ్యాఖ్యలు..

DVV Danayya comments on Rajamouli and RRR

DVV Danayya :  RRR నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచి మొట్టమొదటి ఇండియన్ సాంగ్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై అంతా సంతోషిస్తున్నారు. ఈ విజయం రావడానికి ముఖ్య కారణం రాజమౌళినే. రాజమౌళి ముందుండి సినిమాని, పాటని హాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేశాడు. ఈ ప్రమోషన్స్ కి దాదాపు 80 కోట్లు ఖర్చు అయింది కూడా. అయితే RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా సినిమా నిర్మాత దానయ్య కనపడలేదు. ఈ విషయం పలుమార్లు చర్చలకు వచ్చినా ఎవరూ స్పందించలేదు. దీంతో RRR టీంకి, రాజమౌళికి, దానయ్యకి మధ్య ఏం జరిగింది అని అంతా ఆలోచించారు.

ఇటీవల ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత దానయ్య మీడియాతో మాట్లాడుతూ.. RRR సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో నేను కాంటాక్ట్ లో లేను. కానీ నేను నిర్మించిన సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు సంతోషిస్తున్నాను అని తెలిపారు. దీంతో ఎందుకు కాంటాక్ట్ లేరు అంటూ మరిన్ని వార్తలు వచ్చాయి. దానయ్య సైలెంట్ గా ఉండటంతో దానయ్యపై రకరకాల గాసిప్స్ వచ్చాయి.

Sony Liv : అన్ని భాషల్లో కలిపి ఏకంగా 35 కొత్త సిరీస్ లను ప్రకటించిన సోని లివ్..

దీంతో RRR నిర్మాత దానయ్య తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీటికి సమాధానం ఇచ్చాడు. దానయ్య మాట్లాడుతూ.. నేను రాజమౌళికి 2006 లోనే సినిమాకు అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తర్వాత మర్యాద రామన్న నాతో తీస్తాను అన్నాడు. నేనే పెద్ద సినిమా చేద్దామన్నాను. ఆ తర్వాత రాజమౌళి వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ నేను ఇచ్చిన అడ్వాన్స్ గుర్తుంచుకొని, నాకు మాట ఇచ్చాడని నా కోసం RRR లాంటి భారీ సినిమా చేశాడు. ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలని పెట్టి సినిమా తీసి నాకు సక్సెస్ ఇచ్చాడు. ఆయన కమిట్మెంట్ అలాంటిది. RRR సినిమా ఫలితంపై నేను చాలా సంతృప్తిగానే ఉన్నాను. కొంతమంది ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తున్నారు. అవన్నీ అబద్దాలు. నాకు మీడియా ముందుకు రావాలంటే ఇబ్బంది, నాకు పబ్లిసిటీ కూడా నచ్చదు. అందుకే నేను RRR ఆస్కార్ ప్రమోషన్స్ కి వెళ్ళలేదు. ఆస్కార్ ప్రమోషన్స్ కి డబ్బులు ఖర్చు అయ్యాయని అంటున్నారు. నేనైతే డబ్బులు పెట్టలేదు, రాజమౌళినే పెట్టుకున్నాడు అనుకుంట. ఇక్కడ సినిమా అందరికి చేరేలా నేను ఎలా పెట్టుకున్నానో హాలీవుడ్ లో కూడా అందరికి RRR సినిమా చేరాలని రాజమౌళి పెట్టుకున్నాడు కావచ్చు అని అన్నారు. దీంతో ఇప్పుడు దానయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.