Sony Liv : అన్ని భాషల్లో కలిపి ఏకంగా 35 కొత్త సిరీస్ లను ప్రకటించిన సోని లివ్..

తాజాగా సోని లివ్ ఏకంగా 35 సిరీస్ లను ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, హిందీ భాషలలో 35 సిరీస్ లను ప్రకటించగా అందులో కొన్నిటికి టైటిల్స్ ని కూడా అనౌన్స్ చేశారు. మరి కొన్ని...................

Sony Liv : అన్ని భాషల్లో కలిపి ఏకంగా 35 కొత్త సిరీస్ లను ప్రకటించిన సోని లివ్..

Sony Liv OTT announce 35 series and movies in all languages

Sony Liv :  కరోనా సమయంలో, ఆ తర్వాత ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. దీంతో అనేక ఓటీటీలు(OTT) ఇండియన్ మార్కెట్ మీద కన్నేసి తమ వ్యాపారాన్ని విస్తరించాయి. కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో ప్రేక్షకులని ఆకర్షించాయి. ఇండియాలో నెట్ ఫ్లిక్స్(Netflix), సోని లివ్(Sony Liv), హాట్ స్టార్(Hot Star), అమెజాన్(Amazon), ఈరోస్ నౌ, ఆహా(Aha), ఆల్ట్ బాలాజీ, వూట్, జీ5.. ఇలా ఇప్పటికే అనేక ఓటీటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త కొత్త కంటెంట్స్ తో పోటీ పడుతున్నాయి. ఇటీవల కొన్ని ఓటీటీలు తామే సొంతంగా కొత్త సిరీస్ లు, సినిమాలు, షోలు నిర్మిస్తూ మార్కెట్ లోకి వస్తున్నాయి.

ఒకప్పుడు హిందీలో మాత్రమే ఎక్కువగా మార్కెట్ ఉన్న సోని లివ్ ఓటీటీ ఇటీవల సౌత్ మార్కెట్ మీద కూడా కన్నేసింది. మెల్లిమెల్లిగా సౌత్ లో సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తుంది. తెలుగులో ఇటీవలే నాని నిర్మాణంలో నాని సోదరి దీప్తి గంటా తెరకెక్కించిన మీట్ క్యూట్ అనే సిరీస్ కూడా సోని లివ్ రిలీజ్ చేసింది. ఇలా తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలు, సిరీస్ లు రిలీజ్ చేస్తూ, సొంతంగా కూడా నిర్మిస్తూ సౌత్ మార్కెట్ లో నిలబడాలని చూస్తోంది. ఇక ఇటీవలే రాకెట్ బాయ్స్ సీజన్ 2 కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేసింది.

తాజాగా సోని లివ్ ఏకంగా 35 సిరీస్ లను ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, హిందీ భాషలలో 35 సిరీస్ లను ప్రకటించగా అందులో కొన్నిటికి టైటిల్స్ ని కూడా అనౌన్స్ చేశారు. మరి కొన్ని ప్రస్తుతం ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలుపెట్టాయి. తెలుగులో బృందా, కన్యాశుల్కం, బెంచ్, డిగ్రీ డేస్, ఇంద్రప్రస్థం సిరీస్ లను సోనీలివ్ ప్రకటించింది. బృందాలో త్రిష మెయిన్ లీడ్ గా నటిస్తోంది. కన్యాశుల్కం అవసరాల శ్రీనివాస్ చేయబోతున్నాడు. ఇంద్రప్రస్థం దేవాకట్టా తెరకెక్కించబోతున్నాడు. డిగ్రీ డేస్ ప్రముఖ యూట్యూబ్ ప్రొడక్షన్ చాయ్ బిస్కెట్ నిర్మిస్తుంది.

Keerthy Suresh : మా మంచి మహానటి.. ‘దసరా’ సినిమాకి పనిచేసిన 130 మందికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తి సురేష్..

ఇక తమిళ్ లో జర్నీ, మద్రాస్ మర్డర్ సిరీస్ లు ప్రొడక్షన్ లో ఉన్నాయి. మలయాళం లో జై మహేంద్రన్, బ్లైండ్ ఫోల్డ్ లు నిర్మాణంలో ఉన్నాయి. మరాఠీలో శాంతి క్రాంతి సీజన్ 2, లంపన్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ఇక హిందీలో చమక్, గార్మీ, జంగబూరు, స్కామ్ 3, Freedom At Midnight, Charlie Chopra and the Murder at the Solang Valley, Jazz City, Children of Freedom, మహారాణి సీజన్ 3, గుల్లక్ సీజన్ 4 సిరీస్ లు తెరకెక్కిస్తున్నారు. ఇవే కాకుండా పలు భాషల్లో ఇంకా టైటిల్స్ ప్రకటించని సిరీస్ లు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇన్ని సిరీస్ లతో సోని లివ్ ఏ మేరకు ప్రేక్షకులని తనవైపుకు తిప్పుకుంటుందో చూడాలి.