Keerthy Suresh : మా మంచి మహానటి.. ‘దసరా’ సినిమాకి పనిచేసిన 130 మందికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తి సురేష్..

తాజాగా సినిమాకు పని చేసిన ఓ టెక్నీషియన్ మీడియాతో మాట్లాడుతూ.. కీర్తి సురేష్ సినిమా మొత్తం పని చేసిన టెక్నీషియన్స్, వర్కర్స్.. దాదాపు 130 మందికి 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్................

Keerthy Suresh : మా మంచి మహానటి.. ‘దసరా’ సినిమాకి పనిచేసిన 130 మందికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తి సురేష్..

Keerthy Suresh gifted gold coins to Dasara movie technicians worth 70 lakh rupees

Updated On : March 22, 2023 / 7:57 AM IST

Keerthy Suresh :  అప్పుడప్పుడు హీరోలు, హీరోయిన్స్ తాము పని చేసిన సినిమాకు చెందిన టెక్నీషియన్స్ కి ఏదో ఒక గిఫ్ట్ లు ఇస్తూ ఉంటారు. కొంతమంది సినిమా హిట్ అయ్యాక ఇస్తూ ఉంటారు. కొంతమంది సినిమా రిలీజ్ కి ముందే ఇస్తారు. ఇలా చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్ లోకి మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) చేరింది. ప్రస్తుతం నాని(Nani), కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా(Dasara) సినిమా మార్చ్ 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో సినిమాలో నటించిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కీర్తి సురేష్ గురించి మాట్లాడుతూ.. చాలా మంచి నటి. మాతో పాటు కింద కూర్చొని తినేది. షూట్ లో గ్యాప్ వస్తే మాతో పాటు వచ్చి కబుర్లు చెప్పేది, ఒక హీరోయిన్ లా కాకుండా మాలో ఒకరిగా కలిసిపోయింది అంటూ కీర్తి గురించి గొప్పగా చెప్పాడు. దీంతో కీర్తి అభిమానులతో పాటు మిగిలిన వాళ్ళు కూడా కీర్తి మంచితనం గురించి మెచ్చుకున్నారు.

Bhola Shankar : భోళా శంకర్ పోస్టర్ పై దారుణమైన ట్రోల్స్.. మెహర్ రమేష్ ని ఆడేసుకుంటున్న మీమర్స్..

తాజాగా సినిమాకు పని చేసిన ఓ టెక్నీషియన్ మీడియాతో మాట్లాడుతూ.. కీర్తి సురేష్ సినిమా మొత్తం పని చేసిన టెక్నీషియన్స్, వర్కర్స్.. దాదాపు 130 మందికి 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చింది. వీటి విలువ దాదాపు 70 లక్షల వరకు ఉంటుందని, కీర్తి సురేష్ చాలా మంచి నటే కాకుండా మంచి మనసున్న అమ్మాయి అని చెప్పాడు. దీంతో మరోసారి అందరూ కీర్తిని అభినందిస్తున్నారు. దాదాపు 130 మందికి 70 లక్షల విలువ చేసే కేజీకి పైగా బంగారం గిఫ్ట్ గా ఇవ్వడమంటే మాటలా అని ఆశ్చర్యపోతూనే కీర్తిని మెచ్చుకుంటున్నారు. ఇక దసరా సినిమాపై చిత్రయూనిట్ తో పాటు అభిమానులు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.