Naatu Naatu : టెస్లా కారుల ‘నాటు నాటు’ ఆటకి ఎలాన్ మస్క్ రిప్లై.. RRR రేంజ్ మాములుగా లేదుగా!

అమెరికా న్యూ జెర్సీ లో 150 టెస్లా కార్స్ హెడ్ లైట్స్ తో నాటు నాటు సాంగ్ బీట్ ని సింక్ చేస్తూ లైట్ షో చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోని RRR రీ ట్వీట్ చేయగా, ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు.

Naatu Naatu : టెస్లా కారుల ‘నాటు నాటు’ ఆటకి ఎలాన్ మస్క్ రిప్లై.. RRR రేంజ్ మాములుగా లేదుగా!

Elon Musk reply for rrr naatu naatu

Naatu Naatu : రాజమౌళి తెరకెక్కించిన RRR గురించి ఎంత మాట్లాడుకున్నా తరగడం లేదు. రిలీజ్ అయ్యి ఏడాది అవుతున్నా వరల్డ్ వైడ్ గా ఇంకా ఈ సినిమా పేరు వినిపిస్తూనే ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ ప్రీ ఇండిపెండెన్స్ మూవీ హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి అందించిన నాటు నాటు (Naatu Naatu) సాంగ్ ఆస్కార్ అందుకొని విశ్వ విజేతగా నిలిచింది. ఆస్కార్ అందుకోవడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు అంతా మూవీ టీంకి అభినందనలు తెలియజేస్తున్నారు.

Naatu Naatu : మొన్న కొరియన్, నేడు జర్మన్ ఎంబసీ.. నాటు నాటు పై ఆనంద్ మహేంద్ర ట్వీట్!

ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఎడిసన్ నగరం న్యూ జెర్సీ లో పాపియోనా పార్క్ లో టెస్లా లైట్ షో ను నిర్వహించారు. సుమారు 150 టెస్లా కార్లు ఈ ఫీట్ లో పాల్గొన్నాయి. ఈ కారులు అన్నిటిని RRR షేప్ లో పార్క్ చేసి ‘నాటు నాటు’ పాటకు లైట్ షో ను నిర్వహించారు. ఒక సినిమాకి ఇటువంటి లైట్ షో ను నిర్వహించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ లైట్ షో చూడటానికి కేవలం టెస్లా (Tesla) ఓనర్స్ మాత్రమే కాకుండా, దాదాపు ఒక 500 మంది హాజరయ్యారు.

150 టెస్లా కార్స్ హెడ్ లైట్స్ తో నాటు నాటు సాంగ్ బీట్ ని సింక్ చేస్తూ లైట్ షో చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దానిని RRR టీం రీ ట్వీట్ చేస్తూ థాంక్యూ చెప్పగా.. ఆ ట్వీట్ కి ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) రిప్లై ఇచ్చాడు. రెండు హార్ట్ సింబల్స్ తో RRR ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మొన్న కొరియన్ ఎంబసీ, ఆ తరువాత జర్మన్ ఎంబసీ అధికారులు నాటు నాటు పాటకి చిందేయడం. ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా నాటు నాటు పాటకి రిప్లై ఇవ్వడం చూసి RRR రేంజ్ మాములుగా లేదుగా అంటున్నారు నెటిజెన్లు.

Naatu Naatu : RC15 సెట్‌లో ప్రభుదేవా 100 మంది డాన్సర్స్‌తో కలిసి నాటు నాటు స్టెప్..

కాగా ఈ లైట్ షో కార్యక్రమం సక్సెస్ లో నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ సభ్యులు అయినటువంటి వంశీ కొప్పురావూరి, ఉజ్వల్ కుమార్ కస్తల ప్రముఖ పాత్రను వహించారు. ఎడిసన్ నగర మేయర్‌ సామ్‌ జోషి మరియు అతని బృందం అతి తక్కువ టైములో సహకరించి దీనిని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరగడం విశేషం. విశ్వప్రసాద్ గారు తెలుగులో అద్భుతమైన సినిమాలను కేవలం నిర్మించడమే కాకుండా, ఒక RRR వంటి తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంలో, తాను కూడా ఒక కీలకపాత్రను పోషించడం చెప్పుకోదగ్గ విషయం.