Naatu Naatu : RC15 సెట్‌లో ప్రభుదేవా 100 మంది డాన్సర్స్‌తో కలిసి నాటు నాటు స్టెప్..

ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన 'నాటు నాటు' ఆస్కార్ అందుకొని ప్రపంచ విజేతగా నిలవడంతో ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా కూడా గ్రాండ్ గా విషెస్ తెలియజేశాడు. ప్రభుదేవా ప్రస్తుతం రామ్ చరణ్ RC15 మూవీ కోసం ఒక సాంగ్ కోరియోగ్రఫీ చేస్తున్నాడు.

Naatu Naatu : RC15 సెట్‌లో ప్రభుదేవా 100 మంది డాన్సర్స్‌తో కలిసి నాటు నాటు స్టెప్..

Prabhu Deva step to Naatu Naatu with 100 dancers on rc15 sets

Updated On : March 19, 2023 / 8:19 AM IST

Naatu Naatu : RRR మూవీ రిలీజ్ అయ్యి ఏడాది అవుతుంది. కానీ ఇప్పటికీ ఆ సినిమా క్రియేట్ చేసిన మ్యానియా నుంచి ఎవరు బయటకి రాలేకపోతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్ కి నామినేట్ అవ్వడమే కాకుండా ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ‘నాటు నాటు’ ఆస్కార్ అందుకొని ప్రపంచ విజేతగా నిలవడంతో ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా కూడా గ్రాండ్ గా విషెస్ తెలియజేశాడు.

Ram Charan : ఆస్కార్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు రామ్ చరణ్.. ఇండియా స్పీకర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాంలో ఏం మాట్లాడాడో తెలుసా??

ప్రభుదేవా ప్రస్తుతం రామ్ చరణ్ RC15 మూవీ కోసం ఒక సాంగ్ కోరియోగ్రఫీ చేస్తున్నాడు. నెక్స్ట్ షెడ్యూల్ లో 100 మందికి పైగా డాన్సర్స్ తో చరణ్ అండ్ కియారా పై ఒక సాంగ్ షూట్ చేయనున్నారు. RC15 షూటింగ్ సెట్ లో డాన్సర్స్ తో కలిసి ప్రభుదేవా సాంగ్ డిజైన్ చేస్తున్న సమయంలో చరణ్ అండ్ నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ వచ్చారు. వారిని పూల దండతో అభినందించి, కేక్ కట్ చేయడమే కాకుండా.. 100 మంది డాన్సర్స్ తో కలిసి ప్రభుదేవా నాటు నాటు స్టెప్ వేసి గ్రాండ్ ట్రిబ్యూట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న RC15 పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథని అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు. CEO అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.