Ram Charan : ఆస్కార్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు రామ్ చరణ్.. ఇండియా స్పీకర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాంలో ఏం మాట్లాడాడో తెలుసా??

ఆస్కార్ విన్నింగ్ తర్వాత చరణ్, ఉపాసన శుక్రవారం నాడు ఇండియాకు తిరిగివచ్చారు. అయితే ఢిల్లీలో నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో చరణ్...................

Ram Charan : ఆస్కార్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు రామ్ చరణ్.. ఇండియా స్పీకర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాంలో ఏం మాట్లాడాడో తెలుసా??

Ram Charan spoke various things in India speaker ship summit at Delhi

Updated On : March 18, 2023 / 7:37 AM IST

Ram Charan :  RRR సినిమా నాటు నాటు సాంగ్ ఆస్కార్ విన్నింగ్ తర్వాత చరణ్, ఉపాసన శుక్రవారం నాడు ఇండియాకు తిరిగివచ్చారు. అయితే ఢిల్లీలో నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించే దేశంలోనే అతిపెద్ద స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో చరణ్ పాల్గొనబోతుండటంతో డైరెక్ట్ ఢిల్లీకే వెళ్ళాడు చరణ్. శుక్రవారం మధ్యాహ్నం ఆ కార్యక్రమంలో చరణ్ మాట్లాడి అనేక విషయాలు మీడియాతో పంచుకున్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చరణ్ ని ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ అనేక సంగతులను పంచుకున్నాడు. ఫ్యామిలీ, సినిమా, రాజమౌళి, RRR, పర్సనల్ విషయాలు.. ఇలా చాలా మాట్లాడాడు చరణ్. రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. మా నాన్న, పవన్ కళ్యాణ్ బాబాయ్ తర్వాత నేను ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేది రాజమౌళికే. మా నాన్న, పవన్ బాబాయ్ నాకు రెండు కళ్ళ లాంటివాళ్లు. ఆస్కార్ గెలిచాక మా నాన్న నన్ను చూడటానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చేశారు. ఇక్కడే ఢిల్లీలో ఉన్నారు ప్రస్తుతం. త్వరలో రంగస్థలం కంటే బెటర్ క్యారెక్టర్ చేయబోతున్నాను. మరో మట్టి సినిమా అవుతుంది. చాలా గ్రాండియర్ గా ఉండబోతుంది సినిమా. సెప్టెంబర్ లో షూట్ మొదలవ్వబోతుంది ఆ సినిమా అని తెలిపాడు చరణ్.

అలాగే నెపోటిజం గురించి మాట్లాడుతూ.. ఎవరైనా స్టార్స్ సక్సెస్ అయ్యారు అంటే ఓన్లీ ట్యాలెంట్, హార్డ్ వర్క్ మాత్రమే కారణం. నెపోటిజం అస్సలు కారణం కాదు అని అన్నాడు చరణ్. అలాగే ఇండియన్ సినిమాలో మన చరిత్ర, మన మట్టి స్టోరీలు చెప్పాలి. తెలుగు, హిందీ, ప్రాంతీయ సినిమాలు పోయాయి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా ఒక్కటే అని అన్నాడు. తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఓ హాలీవుడ్ సినిమాలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయి. అది ఓకే అయ్యేదాకా నేను ఏం చెప్పను. నాకైతే హాలీవుడ్ లో నటించాలని ఉంది. భవిష్యత్తులో కచ్చితంగా నటిస్తాను అని అన్నారు.

Guneet Monga : ఆస్కార్ వాళ్ళు నా స్పీచ్ కట్ చేసేశారు.. వేరేవాళ్లు ఎక్కువ మాట్లాడినా పట్టించుకోలేదు.. గునీత్ మోంగా వ్యాఖ్యలు..

ఇక ర్యాపిడ్ ఫైర్ లో పలు ప్రశ్నలు అడగగా.. కియారా తన బెస్ట్ కో స్టార్ అని, చిరంజీవి తర్వాత సల్మాన్ ఖాన్ చిన్నప్పటి నుంచి ఫేవరేట్ హీరో అని, స్విట్జర్లాండ్, రాజస్థాన్ ఫేవరేట్ ప్లేసెస్ అని, హార్స్ రైడింగ్, సినిమాలు చూడటం హాబీలు అని చెప్పాడు. అలాగే స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేయాలని ఉందని చరణ్ అనగా రాజ్‌దీప్ సర్దేశాయ్ విరాట్ కోహ్లీ బయోపిక్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అని అంటే చరణ్ ఆఫర్ వస్తే కచ్చితంగా చేస్తాను అని అన్నారు.