Pawan Kalyan OG : పవన్‌కి విలన్‌గా మారుతున్న బాలీవుడ్ రొమాంటిక్ స్టార్..

పవన్ కళ్యాణ్ OG పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దీంతో నటీనటులను పలు పరిశ్రమల నుంచి ఎంపిక చేసుకుంటున్నాడు దర్శకుడు. ఈ క్రమంలోనే..

Pawan Kalyan OG : పవన్‌కి విలన్‌గా మారుతున్న బాలీవుడ్ రొమాంటిక్ స్టార్..

Emraan Hashmi palys villain role in Pawan Kalyan OG

Emraan Hashmi – OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ OG పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాహూ ఫేమ్ సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. DVV దానయ్య ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దీంతో నటీనటులను పలు పరిశ్రమల నుంచి ఎంపిక చేసుకుంటున్నాడు దర్శకుడు. ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ యాక్టర్స్ అర్జున్ దాస్ (Arjun Das), శ్రియారెడ్డి (Sriya Reddy) లను ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు కోసం సెలెక్ట్ చేసుకున్నారు.

Prabhas : సలార్ టీం మెంబెర్స్ అకౌంట్‌కి ప్రభాస్ రూ.10 వేలు డిపాజిట్.. ఫొటోలు వైరల్!

హీరోయిన్ గా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ని ఫైనల్ చేశారు. ఇప్పటికే ఈ భామ పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి మరో స్టార్ ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో విలన్ పాత్ర చేయబోతున్నాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఇమ్రాన్ హష్మి ఎంట్రీతో బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ కలగనుంది. మరి ఈ ప్రాజెక్ట్ లోకి ఇంకెంతమంది స్టార్స్ ఎంట్రీ ఇస్తారో చూడాలి.

Ram Charan : ఉపాసన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగా.. చరణ్ రియాక్షన్ మీరు ఉహించి ఉండరు.. అదేంటో తెలుసా?

గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా 90’s బ్యాక్ గ్రౌండ్ తో ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ముంబై అండ్ హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ షూటింగ్స్ చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం పవన్ పొలిటికల్ టూర్ మొదలుపెట్టడంతో షూటింగ్ కి కొంచెం బ్రేక్ పడింది. తరువాత షెడ్యూల్ ఎప్పుడు మొదలు అవుతుందనేది త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.