Ram Charan : ఉపాసన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగా.. చరణ్ రియాక్షన్ మీరు ఉహించి ఉండరు.. అదేంటో తెలుసా?

చరణ్ అండ్ ఉపాసన తమ పెళ్ళైన 10 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ శుభవార్త రామ్ చరణ్ కి చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటనేది మీరు ఊహించగలరా?

Ram Charan : ఉపాసన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగా.. చరణ్ రియాక్షన్ మీరు ఉహించి ఉండరు.. అదేంటో తెలుసా?

Ram Charan first reaction after Upasana said her pregnancy

Updated On : June 15, 2023 / 3:00 PM IST

Ram Charan – Upasana : రామ్ చరణ్ అండ్ ఉపాసన తమ పెళ్ళైన 10 ఏళ్ళ తరువాత తల్లిదండ్రులు కాబోతున్నట్లు చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. ఈ 10 ఏళ్లలో వీరిద్దరూ కుటుంబం మరియు ఇతరులు నుంచి ఎన్నో మాటలు, ప్రశ్నలు ఎదురుకున్నారు. అయితే గత ఏడాది డిసెంబర్ లో మెగా వారసత్వం గురించి శుభవార్త చెప్పి అందరికి సమాధానం ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని చిరంజీవి (Chiranjeevi) అందరికి తెలియజేశాడు. అయితే ఈ శుభవార్త ఉపాసన, రామ్ చరణ్ కి చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటనేది మీరు ఊహించగలరా?

Chiranjeevi : చరణ్ & ఉప్సి అంటూ.. స్పెషల్‌గా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్..

చరణ్ తో ఉపాసన.. “నాకు ప్రెగ్నెన్నీ వచ్చిందని అనుకుంటున్నా” అని చెప్పిందట. ఈ మాట విన్న ఏ తండ్రి అయినా ఎగిరి గంతేస్తారు. కానీ మన రామ్ చరణ్.. దీని గురించి ఎక్కువ సంతోషం పడవద్దని, ఒకసారి టెస్ట్ లు చేసి ఒకే అనుకున్న తరువాత సంబరాలు చేసుకుందామని, ఆ తరువాతే అందరికి చెబుదామని ఉపాసనకు చెప్పాడట. అలా క్లారిటీగా నిర్దారించుకున్న తరువాతే ఆ శుభవార్తని మిగతావారికి చెప్పినట్లు చెప్పుకొచ్చింది. ఏ విషయాన్ని అయిన చాలా ప్రశాంతంగా డీల్ చేయడమే రామ్ చరణ్ లో తనకి బాగా నచ్చేదని కూడా వెల్లడించింది.

Ram Pothineni : రామ్ పోతినేని పెళ్లి కుదిరిందా? బిజినెస్ మ్యాన్ కూతురితో వెడ్డింగ్ అంటూ వార్తలు

కాగా ఉపాసన డెలివరీ డేట్ ఆగష్టు నెలలో ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో మెగా అభిమానుల్లో పండుగా వాతావరణం కనిపిస్తుంది. మెగా వారసుడు? మెగా వారసురాలు? అని అందరిలో ఆసక్తి నెలకుంది. ఇక చరణ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఆగష్టు లేదా సెప్టెంబర్ లో పూర్తి కానుంది. ఆ తరువాత కొన్నాళ్ళు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి తమకి పుట్టే బేబీతో కొన్ని రోజులు సరదాగా టైం స్పెండ్ చేయనున్నాడట.