Chiranjeevi : చరణ్ & ఉప్సి అంటూ.. స్పెషల్‌గా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్..

నేడు ఉపాసన - చరణ్ ల 11వ వివాహ దినోత్సవం కాగా పలువురు అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు వీరికి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు కోడలికి శుభాకాంక్షలు చెప్తూ ట్విట్టర్ లో ఓ స్పెషల్ పోస్ట్ చేశారు.

Chiranjeevi : చరణ్ & ఉప్సి అంటూ.. స్పెషల్‌గా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పిన మెగాస్టార్..

Chiranjeevi special post on ram charan and upasana for their 11th wedding anniversary

Updated On : June 14, 2023 / 3:33 PM IST

Ram Charan-Upasana : తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్స్ లో రామ్ చరణ్ – ఉపాసన ఒకరు. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తమ వర్క్స్ తో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు తమ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు సంతోషాన్ని ఇస్తారు. RRR సినిమా నుంచి అయితే ఈ స్టార్ కపుల్ మరింత వైరల్ అవుతున్నారు. పలు ఇంటర్వ్యూలలో చరణ్ ఉపాసన గురించి గొప్పగా, ప్రేమగా చెప్పడం, ఉపాసన కూడా చరణ్ గురించి ఎంతో ప్రేమగా, గొప్పగా చెప్పడంతో ఈ కపుల్ సెంటర్ ఆఫ అట్రాక్షన్ అవుతున్నారు.

2012 జూన్ 14న వీరు పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఉపాసన తల్లి కాబోతున్నట్టు ప్రకటించడంతో ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేడు వీరి 11వ వివాహ దినోత్సవం కాగా పలువురు అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు వీరికి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు కోడలికి శుభాకాంక్షలు చెప్తూ ట్విట్టర్ లో ఓ స్పెషల్ పోస్ట్ చేశారు.

Bhargav Ram : ఎన్టీఆర్ రెండో తనయుడు భార్గవ్ రామ్ బర్త్‌డే.. ట్విట్టర్లో ట్రెండింగ్..

ఉపాసన – చరణ్ ల ఫోటోని షేర్ చేస్తూ చిరంజీవి తన ట్విట్టర్ లో.. హాయ్ చరణ్ & ఉప్సి.. ఈ స్పెషల్ రోజున మీ ఇద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. మీ ఇద్దరూ మమ్మల్ని మేము అనుకోనంతగా గర్వపడేలా చేశారు. త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు. మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్. మీ ప్రేమ గురించి మీ పిల్లలకు కథలుగా చెప్పాలి ప్రేమతో ఆశీర్వాదాలు అందిస్తున్నాం.. మీ అమ్మా, నాన్న అంటూ రాశారు. దీంతో చిరంజీవి చేసిన ఈ స్పెషల్ ట్వీట్ వైరల్ గా మారింది.