Erida : ‘భీమ్లా నాయక్’ బ్యూటీతో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన నాజర్.. వీడియో వైరల్

విలక్షణ నటుడు నాజర్.. 26 సంవత్సరాల సంయుక్త మీనన్‌తో రొమాన్స్ చెయ్యడం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది..

Erida : ‘భీమ్లా నాయక్’ బ్యూటీతో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన నాజర్.. వీడియో వైరల్

Erida Malayalam Movie

Erida: 63 ఏళ్ల విలక్షణ నటుడు నాజర్.. 26 సంవత్సరాల సంయుక్త మీనన్‌తో రచ్చ రంబోలా అనే రేంజ్‌లో రెచ్చిపోయి రొమాన్స్ చేశారు. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త.. పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ లో రానా భార్య క్యారెక్టర్‌లో నటిస్తోంది.

Samyuktha Menon : డానియెల్ శేఖర్ వైఫ్ ఈమే

నాజర్, సంయుక్త మీనన్‌, కిషోర్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళీ మూవీ ‘ఎరిడా’ (Erida) – a tale of a goddess in love.. పాండమిక్ కారణంగా థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ట్రైలర్, దీనికి సంబంధించి హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Erida Movie Erida

60 ఏళ్ల వయసున్న వ్యక్తి గ్యాంబ్లింగ్‌కి బానిసగా మారడం.. అనుకోకుండా ఓ యంగ్ కపుల్‌‌తో బెట్టింగ్ కట్టడం.. తర్వాత ఊహించని పరిణామాలు జరగడం.. ఇలా ఇంట్రెస్టింగ్‌గా సాగే ఈ ‘ఎరిడా’ సినిమాలో నాజర్, సంయుక్త మీనన్‌తో చేసిన రొమాన్స్ గురించే నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. దీంతో ‘ఎరిడా’ కి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసినట్లైంది.